యువ

సాఫ్ట్‌వేర్ సాగుబడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఓ తాత...ఓ మనవడు!
పదేళ్ల మనవణ్ని 76 ఏళ్ల తాత రోజూ పొలానికి తీసుకెళ్లేవాడు. పంటలు పండించడంలో ఉన్న తృప్తినీ, పదిమందికీ అన్నం పెట్టే రైతన్న గొప్పదనాన్ని విడమరచి చెప్పేవాడు.
కట్ చేస్తే... ఆ మనవడు బాగా చదువుకున్నాడు. బిటెక్, ఎంబిఎ, పిహెచ్‌డి చేశాడు. ఓ పెద్ద కంపెనీలో ఏడాదికి 24 లక్షల జీతం వచ్చే పెద్ద ఉద్యోగం దొరికింది. 15 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాక, అందులో తృప్తి లేదనిపించింది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, భార్యాబిడ్డల్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. రైతుల సహకారంతో, తన తెలివితేటల్ని జోడించి పొలంలో బంగారం పండించడం మొదలుపెట్టాడు. ఇప్పుడతని టర్నోవర్ రెండు కోట్ల రూపాయలు!
చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో మేధాపూర్ అనే ఓ కుగ్రామం ఉంది. ఆ గ్రామంలో వసంతరావు కాలే అనే పెద్దాయన ఏళ్ల తరబడి వ్యవసాయం చేశాడు. నమ్ముకున్న నేలతల్లి ఆయనకేనాడూ ద్రోహం చేయలేదు. అదే తన మనవడు సచిన్‌కూ చెప్పేవాడు. అయితే పట్నంలో స్థిరపడిన సచిన్ తల్లిదండ్రులకు కొడుకును ఓ ఇంజనీర్‌గా చూడాలని ఆశ. అందుకు తగ్గట్టే బిటెక్ చదివించారు. ఆ తర్వాత ఎంబిఎ...పిహెచ్‌డి. తల్లిదండ్రుల కల నెరవేర్చాడు గానీ, తాత ఆశయాన్ని మాత్రం అలాగే గాలికొదిలేశాడు ఆ మనవడు. నెలకు రెండు లక్షలు జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నా సచిన్‌లో ఏదో తెలియని వెలితి. ముక్కూ మొహం తెలియని యజమానికోసం పడుతున్న కష్టం, తాత కోసం ఎందుకు పడకూడదూ అనే ఆలోచన అతన్ని నిద్రకు దూరం చేసేది. చివరకు ఓ రోజు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఉద్యోగం వదిలేయాలన్నదే ఆ నిర్ణయం. పదిహేనేళ్లపాటు పనిచేస్తే వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు మొత్తాన్ని పట్టుకుని, భార్యాబిడ్డల్ని తీసుకుని సచిన్ మేధాపూర్ వెళ్లిపోయాడు. ఇది జరిగింది 2013లో.
తాత ముత్తాతలనుంచి సంక్రమించిన పొలంలోకి దిగి స్వయంగా దుక్కి దున్నడం మొదలుపెట్టాడు. ఓ విద్యాధికుడు పొలంలోకి దిగి పంటలు పండిస్తానంటే ఎవరు మాత్రం నమ్ముతారు? సచిన్ విషయంలోనూ అదే జరిగింది. రైతులు గేలి చేశారు. తల్లిదండ్రులు నిరుత్సాహ పరిచారు. అయితే సచిన్ మాత్రం ఒక నిర్ణయానికొచ్చాడు. రెండేళ్లు కష్టపడి సాగు చేద్దాం...కుదరలేదా వదిలేసి, మళ్లీ పట్నానికి వెళ్లిపోదామని. అయితే అతని కష్టం ఫలించింది. సాగులో అతను అవలంబించిన వినూత్న పద్ధతులు అతనికే కాదు, చుట్టుపక్కల రైతాంగానికీ లాభాల పంట పండించాయి. అదేలాగ అంటే...పొలాన్ని కాంట్రాక్ట్‌కు తీసుకోవడమనే కొత్త పద్ధతికి సచిన్ తెర లేపాడు. తన గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాన్ని కాంట్రాక్ట్‌కు తీసుకున్నాడు. పొలంలో పంటను ఆ రైతే పండిస్తాడు. ఏం పండించాలో సచిన్ చెబుతాడు. పంట వచ్చాక, ఆ పంటను సచినే కొంటాడు. దానిని మార్కెట్‌లో అమ్మాక, లాభంలో రైతుకు అధిక మొత్తం వాటా ఇస్తాడు. ఈ పద్ధతి బాగుండటంతో రైతులు కూడా సై అన్నారు. మొదటేడాది లాభాలు రావడం, వాటిని రైతులకు పంచిపెట్టడంతో అతన్ని రైతులు నమ్మారు. దాంతో సచిన్ ‘ఇన్నొవేటివ్ అగ్రిలైఫ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఓ సంస్థను నెలకొల్పాడు. సమీపంలోని బిలాస్‌పూర్ అగ్రికల్చరల్ కాలేజీలో పనిచేసేవారిని కన్సల్టెంట్లుగా నియమించుకున్నాడు. వారి సూచనలూ, సలహాల ప్రకారం పంటకు చీడపీడలు రాకుండా చూసుకుంటారు. తనకున్న 24 ఎకరాల పొలంలో సచిన్ వరి, కాయగూరలూ పండిస్తున్నాడు. ఇప్పుడు అతని కింద 200 ఎకరాల భూమి ఉంది. 137 మంది కౌలు రైతులు పనిచేస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల రూపాయల టర్నోవర్ ఉంటోంది. కమ్యూనికేషన్స్‌లో పీజీ చేసిన అతని భార్య కల్యాణి సచిన్‌కు చేదోడుగా ఉంటోంది. ఏదో ఒక రోజు తన కంపెనీ ముంబయి స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదు కావాలన్నది సచిన్ కల. ఆ కల నెరేవేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానంటున్నాడతను. విద్యాధికులు అన్నదాతకు అండదండలు అందిస్తే బంగారం పండించగలరనడానికి ఉదాహరణ సచిన్.

చిత్రం... పొలంలో, ఇన్‌సెట్‌లో సచిన్