యువ

సారీ కాదు.. సవాళ్లపై స్వారీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మవిశ్వాసమే విజయ సోపానం. సవాళ్లు ఎంత
కఠినమైనా వాటిని సునాయాసం చేసుకోవడానికి
తోడ్పడేది మనోధైర్యం. నేటి పోటీ వాతావరణంలో
ఏదీ సునాయాసం కాదు. కష్టసాధ్యమే! మిమ్మల్ని మీరు
తీర్చిదిద్దుకోండి.సవాళ్లకు బెదిరిపోతే అవి మరింతగా భయపెడతాయి. డోలాయమానం వీడండి. పలాయన ధోరణి పక్కన పెట్టండి. అవకాశాల ప్రపంచంలో
విజయాల వేటను సాగించండి.

చదువు, ప్రవర్తన, ఆటలు, పాటలు ఇలా ఒకటేమిటి ఈ పోటీకి అంతూ పొంతూ ఉండదు. ఇది లేకపోతే జీవితంలో ఎదుగుదలకూ, ఉన్నత స్థానాలను అధిరోహించడానికీ ఆస్కారమూ ఉండదు. చిన్నతనంలో ఇలాంటి పోటీని గుణాత్మకంగా, ఆ పిల్లల్లో బాగా చదువుకోవాలన్న పట్టుదలను పెంచేదిగా పరిగణించవచ్చు కానీ..కాలేజీ స్థాయిని దాటి ఉద్యోగాల్లో ప్రవేశించిన తర్వాత ఎదురయ్యే ఈ రకమైన పోటీ వత్తిడి మాత్రం చాలా ప్రమాదకరమైనదే. ఏ వ్యక్తికైనా ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలిగేలా స్వీయ ప్రతిభను పెంచుకోవాలా..అందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్నది అంత తేలిగ్గా తేల్చుకోగలిగే విషయం కాదు. ఇలాంటి వత్తిడిమయ పరిస్థితి కొందరికి వరమైతే ఇంకొందరికి శాపమే! ఎందుకంటే కొందరు ఎదుటివారిని చూసి తమనుతాము సరిదిద్దుకుంటారు. పోటీగా రాణించడానికి..తమదే పైచేయి అని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రకమైన గుర్తింపు కోసం వారు పడే తంటాలు మామూలువేమీ కాదు. వారి శ్రమకు, ప్రయత్నానికి తగిన గుర్తింపు అన్నది తమ ప్రతిభను
నిరూపించుకోగలిగి నప్పుడే ఉంటుంది.
ఈ రకమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు కచ్చితంగా తమతమ రంగాల్లో ఉన్నత స్థానాలను అందుకోవడానికి ఎక్కువ ఆస్కారం, అవకాశం ఉంటుంది.

పోటీ లేనిదే రాణింపు ఉండదు. ఎదుటివాడు బలవంతుడా..బలహీనుడా..అఅనే విషయం తేలాలంటే పోటీ అన్నది ఉండి తీరాల్సిందే. ఇలాంటి పోటీ వాతావరణం లేక పోతే ఒకరిని ఇంకొకరితో పోల్చడమే ఉండదు. ఎలిమెంటరీ స్థాయి పరీక్షలు మొదలుకుని వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించడం వరకూ వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య, వ్యవస్థల మధ్య, చివరికి దేశాల మధ్యా ఈ పోటీ తప్పదు. అంటే ప్రతి ఒక్కరూ తమతమ జీవితాల్లో ఏదో దశలో ఈ పోటీని ఎదుటివారి నుంచి ఎదుర్కొన్నవారేనని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. ఈ రకమైన పోటీ అనేది బాల్యదశ నుంచే అందరిలో మొదలు అవుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వారిలో ఎవరు బాగా చదువుతారు అన్నది ఈ రకమైన తులనాత్మక ప్రతిభ విశే్లషణకు దారితీస్తుంది. చదువు, ప్రవర్తన, ఆటలు, పాటలు ఇలా ఒకటేమిటి ఈ పోటీకి అంతూ పొంతూ ఉండదు. ఇది లేకపోతే జీవితంలో ఎదుగుదలకూ, ఉన్నత స్థానాలను అధిరోహించడానికీ ఆస్కారమూ ఉండదు. చిన్నతనంలో ఇలాంటి పోటీని గుణాత్మకంగా, ఆ పిల్లల్లో బాగా చదువుకోవాలన్న పట్టుదలను పెంచేదిగా పరిగణించవచ్చు కానీ..కాలేజీ స్థాయిని దాటి ఉద్యోగాల్లో ప్రవేశించిన తర్వాత ఎదురయ్యే ఈ రకమైన పోటీ వత్తిడి మాత్రం చాలా ప్రమాదకరమైనదే. ఏ వ్యక్తికైనా ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలిగేలా స్వీయ ప్రతిభను పెంచుకోవాలా..అందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్నది అంత తేలిగ్గా తేల్చుకోగలిగే విషయం కాదు. ఇలాంటి వత్తిడిమయ పరిస్థితి కొందరికి వరమైతే ఇంకొందరికి శాపమే! ఎందుకంటే కొందరు ఎదుటివారిని చూసి తమనుతాము సరిదిద్దుకుంటారు. పోటీగా రాణించడానికి..తమదే పైచేయి అని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రకమైన గుర్తింపు కోసం వారు పడే తంటాలు మామూలువేమీ కాదు. వారి శ్రమకు, ప్రయత్నానికి తగిన గుర్తింపు అన్నది తమ ప్రతిభను నిరూపించుకోగలిగి నప్పుడే ఉంటుంది. ఈ రకమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు కచ్చితంగా తమతమ రంగాల్లో ఉన్నత స్థానాలను అందుకోవడానికి ఎక్కువ ఆస్కారం, అవకాశం ఉంటుంది. ఇంకో రకం వ్యక్తులది పోటీ అంటేనే పారిపోయే మనస్తత్వం. తమపనేదో తాము చేసుకు పోవడమే తప్ప తమ ప్రతిభను ఇంకొకరితో పోల్చుకుని లోపాలను సరిదిద్దుకోవడం అన్నది వీరితో కాని పని. ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు పోటీ పరిస్థితిని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఈ బలహీన క్షణాన్ని తట్టుకోగలిగితే.ఎదురైన సవాళ్లపై స్వారీ చేయగలిగే మానసిక నిబ్బరాన్ని, మనోధైర్యాన్నీ సంతరించుకోగలిగితే అవన్నీ అవకాశాలుగా మారతాయి. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికీ దోహదం చేస్తాయి. ఇలాంటి పరిస్థితి ఉద్యోగాల్లో ఎదురైనా, వ్యాపారపరంగా తలెత్తినా...చదువుల్లో తారసిల్లినా కూడా దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలే తప్ప లొంగిపోయి కుంగిపోకూడదు. ఇలాంటి దృఢ సంకల్ప బలాన్ని నిరూపించుకున్న వ్యక్తులే చరిత్రలో రాణించారు. తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుని చరిత్రమే తిరగరాశారు. ఏ రంగంలోనైనా వత్తిడి లేదా సమకాలికుల నుంచి పోటీ అన్నది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండూ కూడా సరైన రీతిలో పరిగణించగలిగితే..వాటి వెనుక ఉన్న పరిస్థితిని గుణాత్మకంగా అర్థం చేసుకోగలిగితే వీటి ప్రభావం నుంచి సునాయాసంగా బయటపడేందుకు..ఎవరి వత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా రాణించేందుకూ ఆస్కారం ఉంటుంది. మనకు ఎదురయ్యే వత్తిడి లేదా పోటీ పరిస్థితిని ఎలా పరికిస్తామన్నదానిపైనే తదుపరి నిర్ణయాలు ఆధార పడి ఉంటాయి. ఈ నిగూఢ సత్యాన్ని అర్ధం చేసుకోగలిగితే సరైన పథంలో మన గమనాన్ని తీర్చిదిద్దుకుని గమ్యాన్ని చేరుకోవడం అన్నది అసాధ్యం కాదు..కానీ కష్ట సాధ్యం! ఏ రంగంలోనైనా పోటీ అన్నది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దీని ద్వారా ప్రతిభకు పదును పెట్టుకునేందుకు ఎలాంటి అవకాశం ఉంటుందో... వాటి ప్రభావాన్ని తట్టుకోలేక కుంగిపోయేందుకూ అంతే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తుకుండా ఉండాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన ప్రతిభ మీద విశ్వాసం ఉండాలి. ఎలాంటి సవాలునైనా ము ఖాముఖీ ఢీకొనగలుగుతామన్న ఆత్మ స్థయిర్యం ఉండాలి. ఈ మూడూ మీ సొంతమైతే..మీ వ్యకిత్వంలో భాగమైతే సవాళ్లను ఢీకొని సమస్యలను దూది పింజల్లా పటాపంచలు చేయడం సునాయాసం. ఇందులోనే విజయం ఉంది. ఆ నిజాన్ని యువత గ్రహించాలి. పోటీ వాతావరణంలో ఉండే అంతరార్థాన్ని గ్రహించాలి!

-బి.సుధ