యువ

తేనెలాంటి మనసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేనె చాలామందికి ఇష్టం..
కానీ ఓ పనె్నండేళ్ల అమ్మాయికి తేనెటీగలంటే ప్రాణం.
తేనె కోసం తేనెటీగలను చంపేయడాన్ని చూసి చలించిపోయిన ఆ అమ్మాయి ఆలోచనలకు పదునుపెట్టింది. తేనెపట్టు స్వరూపం దెబ్బతినకుండా, దానినిండా ఉండే తేనెటీగల ప్రాణాలకు ముప్పురాకుండా, తేనె తీసేవారికి వాటినుంచి ప్రమాదం ఎదురవకూడదంటే ఏం చేయాలబ్బా అని ఆలోచించింది. చివరకు ఓ రోబోను కనిపెట్టింది. ఆ ఆవిష్కరణ ఆమెను అంతర్జాతీయ రోబోటిక్ చాంపియన్‌గా నిలిపింది.
ఆ బాలిక పేరు కావ్య విఘ్నేశ్.
ఆమె కనిపెట్టిన రోబో పేరు ‘బీ సేవర్ బాట్’.
పనె్నండేళ్ల కావ్య స్వతహాగా గ్రాఫిక్ డిజైనర్.. ఇంజనీరింగ్ అంటే ఇష్టం. రోబోలంటే పిచ్చి. ఆ తపనే ఆమెను చాంపియన్‌ను చేసింది.
***
తేనె అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు?
ఎంతిష్టమున్నా తేనెటీగలున్న పట్టుదగ్గరకు వెళ్లడమంటే ఎవరైనా భయపడాల్సిందే. అవి చేసే దాడి అలాంటిది మరి. మన భయం తేనెటీగల ప్రాణాలమీదకు వస్తోంది. పొగబెట్టో, మంటలు రాజేసో వాటిని చెదరగొట్టి, లేదా చంపి తేనె సేకరిస్తున్నారు. దానివల్ల మనకి మనం ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామో తెలియక చేస్తున్న పని అది. ఈ భూమీద ఏ మొక్క లేదా చెట్టు, చివరకు గడ్డి అయినా విస్తృతంగా ఎదగాలంటే, వాటి జాతులు విస్తరించాలంటే పువ్వులు పూయాలి. వాటిలోని పరాగ రేణువులు మరో మొక్కలోని పరాగ రేణువులతో కలిస్తేనే ఫలదీకరణం జరుగుతుంది. అప్పుడే కాయలు, విత్తనాలు తయారై ఆ జాతి విస్తరిస్తుంది. ఇలా పరాగ రేణువులు ఒకచోటి నుంచి మరోచోటుకు చేర్చేవి తేనెటీగలే. ఈ భూమీద జరుగుతున్న ఫుడ్‌చెయిన్‌లో 90 శాతం తేనెటీగలవల్లే జరుగుతోంది. అయితే తేనె కోసం లక్షల సంఖ్యలో తేనెటీగల్ని చంపేయడం, తేనెపట్టులను ఇష్టం వచ్చినట్లు ఛిద్రం చేయడంతో పెనుముప్పు ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని గమనించిన కావ్య ఆలోచించింది. తేనె కావాలి. తేనెటీగలు చచ్చిపోకూడదు. వాటి గూడు (పట్టు) చెదిరిపోకూడదు. ఇదే ఆలోచన. చివరకు తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. ఆ ఆలోచన ఆమెకు ఎంతో పేరుతెచ్చింది.

ఆ రోబో ఏం చేస్తుంది?
తేనెతో నిండిన పట్టును ఏమాత్రం చెక్కుచెదరకుండా తేనెటీగలు చెదిరిపోకుండా పై అంచునుంచి కోసి మరో ప్రాంతానికి తరలించడమే ఆ రోబోపని. ఈ రోబో తయారీకి రోబోటిక్స్ శాస్తప్రరిజ్ఞానం, హైటెక్ కాంపోనెంట్స్‌ను మిళితం చేసింది. ‘బీ సేవర్ బాట్’ అని వాడుకలో అంటున్నా ఆ రోబోకు ఆమె పెట్టిన పేరు లైట్నింగ్ మెక్‌క్వీన్. లెగో మైండ్‌స్టార్మ్ ఇవి 3 (మూడో జనరేషన్ రోబో కిట్ టెక్నాలజీ)కి తోడుగా ప్రోటొటైప్ క్వాడ్‌కాప్టర్‌గా చెప్పుకునే ఫ్లయింగ్ ద్రోన్, దానితోపాటు ఉండే 3డి కెమెరా సేవలందిస్తాయి. తేనెపట్టు ఎక్కడ ఉందో, ఎంత పరిమాణంలో ఉందో, ఎంత స్థలాన్ని ఆక్రమించిందో లెక్కగట్టి త్రీడీ చిత్రాన్ని అవి అందిస్తాయి. కాడ్‌కామ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆ తేనెపట్టును, ఈగలతో సహా తరలించడానికి ఎంత సైజు ఎన్‌క్లోజర్ కావాలో ఆ రోబో సూచిస్తుంది. గాలి పీల్చుకునే వెసులుబాటుతో కూడిన ఎన్‌క్లోజర్ సిద్ధమయ్యాక మూడు చేతులున్న రోబో పని మొదలు పెడుతుంది. రెండు చేతులు ఎన్‌క్లోజర్‌ను తేనెపట్టు చుట్టూ అమరేలా పట్టుకుంటే మూడోచెయ్యికి అమర్చిన బ్లేడ్ తేనెపట్టును పై అంచునుంచి (గోడ లేదా చెట్టుకు అంటుకున్న భాగం) కోస్తుంది. ఎన్‌క్లోజర్‌లోకి పట్టు జారాక సీల్‌చేసి తరువాత తేనెపట్టును తేనెటీగల సంరక్షణ కేంద్రానికి తరలిస్తారు.

ద చాంపియన్
ఆటలాడే వయసులో ఆమె రోబోలకు ప్రాణం పోసే ఆలోచనల్లో ఉంది. రోబోటిక్స్, లెగో లీగ్ అంటే ఇష్టం. తొమ్మిదేళ్ల నుంచే రోబోటిక్స్ అంటే ప్రాణం. ఆమె ఇష్టాన్ని గమనించిన తల్లి వేసవి సెలవుల్లో రోబోక్లబ్‌లో కావ్యను చేర్పించింది. 2015, 16 సంవత్సరాల్లో కావ్య ఢిల్లీ రీజనల్ రోబోటిక్స్ చాంపియన్ షిప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు హనీబీ సేవింగ్ రోబోతో డెన్మార్క్‌లో జరగనున్న అంతర్జాతీయ రోబోటిక్స్ ఛాంపియన్‌షిప్‌కోసం మరోసారి సిద్ధమవుతోంది. తన మిత్రులతో కలసి కావ్య ఆరస్‌లో జరిగిన తొలి యూరోపియన్ ఓపెన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 2 లక్షలమంది చిన్నారుల మధ్య జరిగిన పోటీలో వీరు విజయం సాధించారు. దేశంలో తేనెటీగల సంరక్షణకోసం తాను కనిపెట్టిన బీ సేవర్ రోబోను వినియోగించాలని ప్రభుత్వాన్ని కావ్య అభ్యర్థించనుంది. తన బృందంతో కలసి చేసే పరిశోధనలకు ‘క్రౌట్‌సర్ఫింగ్’ పేజ్ ద్వారా ఆర్థిక సహాయం కోరుతోంది కావ్య.