యువ

ఆన్‌లైన్‌లో బౌద్ధ సన్యాసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇ కామర్స్‌లో అందె వేసిన చేయిగా పేరొందిన అమెజాన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇంట్లో పూజ తలపెట్టారా? అయితే పూజారిని కూడా మేమే పంపిస్తామంటూ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. అఫ్‌కోర్స్! ఈ ఆఫర్ ఇండియాలో కాదు...జపాన్‌లో! జపాన్‌లో బౌద్ధమతస్థుల కోసం ఇలాంటి ఆఫర్ ఇచ్చి అందర్నీ అమెజాన్ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా తన వెబ్‌సైట్‌లో ‘ఓబో సాన్-బిన్’ అనే సర్వీస్‌ను మొదలు పెట్టింది.
అంటే ‘మిస్టర్ మాంక్ డెలివరీ’ అని అర్థం. ఇంట్లో పూజాదికాలు తలపెట్టినప్పుడు అమెజాన్‌కు ఆర్డరిస్తే నేరుగా ఇంటికే ఓ బౌద్ధ సన్యాసిని పంపిస్తుందన్నమాట. దీనికయ్యే ఖర్చంటారా? ఫీజు 35వేల యెన్‌లు (150 డాలర్లు), రవాణాకయ్యే ఖర్చులు, గుడికి విరాళం. ఈ మూడూ కలిపి ఓ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ చెల్లిస్తే బౌద్ధ సన్యాసి ఇంటి ముందు వాల్తాడు. సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు నిర్వహించి, ‘దక్షిణ’ పుచ్చుకుని వెళ్తాడు. దీనికోసం అమెజాన్...టోక్యోకి చెందిన మిన్‌రెవీ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. మిన్‌రెవీకి జపాన్‌లోని అనేక బౌద్ధాలయాలతో సంబంధాలు ఉన్నాయి. బౌద్ధ సన్యాసులను అమెజాన్‌కు ఈ కంపెనీయే సరఫరా చేస్తుంది. ఎలా ఉంది ఐడియా? *