యువ

అద్దెకు మొబైల్ ఫోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైకిళ్లు మొదలుకొని కార్లవరకూ అద్దెకివ్వడం తెలుసు. ఇళ్లు అద్దెకివ్వడం కూడా తెలిసిందే. కానీ మొబైల్ ఫోన్లను అద్దెకిచ్చే కానె్సప్ట్ గురించి విన్నారా? ఎల్‌జి, శామ్‌సంగ్ వంటి ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలకు పుట్టినిల్లయిన దక్షిణ కొరియా ఈ సరికొత్త కానె్సప్ట్‌కి తెరతీసింది. అక్కడ ఎస్ టెలికామ్ అనేది అతిపెద్ద వైర్‌లెస్ టెలీకమ్యూనికేషన్స్ ప్రొవైడర్. ఈ సంస్థ ‘ఎంజాయ్ మొబైల్ కొరియా’ అనే పథకానికి రూపకల్పన చేసి, దాన్ని ప్రమోట్ చేసేందుకు అటు కొరియా టూరిజం ఆర్గనైజేషన్‌తోనూ, ఇటు శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీతోనూ టై అప్ పెట్టుకుంది. టూరిజంను ప్రమోట్ చేసే ఉద్దేశించిన రూపొందిన ‘ఎంజాయ్ మొబైల్ కొరియా’ పథకం కింద శామ్‌సంగ్ మొబైల్ ఫోన్లను ఐదు రోజులపాటు అద్దెకిస్తారు. ఇవి టూరిస్టులకు మాత్రమే. అయితే అందరు టూరిస్టులకూ కాదు. ప్రతి రోజూ విమానాశ్రయంలో దిగినవారిలో 250 మంది లక్కీ టూరిస్టుల్ని డ్రాలో ఎంపిక చేసి వారికి మొబైల్ ఫోన్లు ఇస్తారు. 1జిబి డేటా కూడా ఉచితం. ఇందుకోసం టూరిస్టులు ఒక్క పైసా కూడా చెల్లించక్కర్లేదు. ఈ ఐడియా బాగుందనుకుంటున్నారా? ఏమో, ఈ కానె్సప్ట్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఎవరైనా రేపో మాపో అద్దె సైకిళ్ల మాదిరిగా అద్దె మొబైల్ ఫోన్ల దుకాణం తెరిచినా తెరవ్వొచ్చు. ఏమంటారు? *