యువ

రికార్డుల వలలుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూటా ఎనభై కిలోల బరువుండే బ్రెడ్ రొట్టె.. 14 అడుగుల పొడవైన ‘పై’ .. 14,353 చిన్నపాటి సుగర్ క్యూబ్స్‌తో నిర్మించిన క్యూబ్స్‌కట్టడం. అలాగే 32 చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించే మాల్‌పువా (ఇటాలియన్ వంటకం).. ఇవన్నీ ఏ సంపన్నుల వివాహానికి సంబంధించిన మెనూలోనో ఉండే ఐటంలు కాదు.. జైపూర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ సృష్టించిన రికార్డు వంటకాల్లో కొన్ని మాత్రమే. ఆయన సాధించిన ఇలాంటి అద్భుతాలు ఎనిమిది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడమే కాకుండా అత్యధిక రికార్డులు సృష్టించిన వ్యక్తిగా ఆయనకు అరుదైన గౌరవాన్ని సైతం తెచ్చిపెట్టాయి. అంతేకాదు, బ్రిటన్‌కు చెందిన వరల్డ్ రికార్డ్స్ యూనివర్శిటీనుంచి ‘డాక్టరేట్’ను సైతం అందుకునేలా చేశాయి. పర్యాటక రంగంలో ఎంబిఏ చేసిన శ్రీవాస్తవ ఆ యూనివర్శిటీ డాక్టరేట్‌తో సత్కరించిన 13 మందిలో ఒకరు.ఈయన సృష్టించిన రికార్డులు చూస్తే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలో భాగంగా విరాటుడి కొలువు చేరినప్పుడు వలలుడి పేరుతో భీముడు చేసిన వంటలు గుర్తుకు వస్తాయి. రాజాస్థానంలోని వందలాది మందికి సరిపడా వంటలను వలలుడు అవలీలగా వండేస్తాడు.
49 ఏళ్ల మనోజ్ శ్రీవాస్తవ వృత్తి రీత్యా జైపూర్‌లోని మణిపాల్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్ హెడ్‌గా పని చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వంటల్లో ఇప్పటివరకు ఎవరూ తలపెట్టని ప్రయోగాలు చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించడం ఆయన హాబీ. 2008లో మొట్టమొదటిసారిగా అతి పెద్ద బ్రెడ్‌ను తయారు చేయడం ద్వారా తొలి ప్రపంచ రికార్డును సృష్టించారు. 180 కిలోల బరువుండే ఆ బ్రెడ్‌ను తరలించడానికి ఏకంగా క్రేన్ కావలసి వచ్చిందట. కేవలం 16 గంటల్లో ఆ బ్రెడ్‌ను వండినట్లు శ్రీవాస్తవ చెప్పారు. ఆ విజయం స్ఫూర్తితో 2013లో ప్రపంచంలోనే అతి పెద్ద ‘పై’(మాంసం కూరగాయలు, లేదా పండ్లతో వండుతారు)ని అరవై మంది విద్యార్థుల సాయంతో 12 గంటల్లో వండాను. 14 అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు ఉండే అది 365 కిలోల బరువుతూగింది అని ఆయన చెప్పారు. ఆ మరుసటి సంవత్సరం సుగర్ క్యూబ్స్ కట్టడాన్ని రూపొందించారు. దానికోసం ఆయన 14,353 సుగర్ క్యూబ్స్‌ను వాడారు. అయిదు మీటర్ల పొడవు, అయిదు మీటర్ల వెడల్పు ఉండే దీన్ని 11 మంది విద్యార్థుల బృందం సాయంతో 3 రోజుల్లో నిర్మించారు. ఈయన నాలుగో రికార్డు గ్రీకు వంటకం అయిన ‘వౌసాక్కా’. 800 కిలోల బరువు, 12 అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పుతో ఉండే ఈ వంటకం కూడా ఓ రికార్డే. 560 కిలోల బరువు, 96చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించిన ఫ్రెంచ్ ‘వెజిటబుల్ ఆ గ్రాటిన్’, 62 కిలోల బరువు, 8 అడుగుల పొడవుండే ‘మాల్‌పువా’, అలాగే నాలుగు అడుగుల పొడవుండే ఇటాలియన్ ‘సోక్కా’ ఆయన సృష్టించిన రికార్డు వంటకాల్లో ఉన్నాయి.
‘నేను ఎప్పుడు కొత్త రికార్డు సృష్టించాలని అనుకున్నా దానికోసం బోలెడంత పరిశోధన అవసరమవుతుంది. దానికోసం నెలలే గడిచిపోతాయి కూడా.. అయితే అదే సమయంలో ఏదయినా కొత్త రికార్డుకోసం ప్రయత్నించిన ప్రతిసారి గొప్ప ధ్రిల్‌తో పాటు అది విజయవంతమైనప్పుడు ఓ వింత అనుభవం కలుగుతుంటాయి’ అని శ్రీవాస్తవ అంటారు. అనుకున్న ప్రాడక్ట్‌పైన తగినంత రిసెర్చ్ చేసిన తర్వాత ఆమోదం కోసం ఓ ప్రతిపాదనను గిన్నిస్ బుక్, లేదా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కార్యాలయానికి పంపిస్తానని కూడా ఆయన అంటారు.