యువ

నచ్చే రంగుల్లో ‘దృశ్యం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీ వారు అనుకున్నట్లే జరిగితే..
ఓ అద్భుతం ఆవిష్కారమైనట్లే. వారి పరిశోధనల్లో ప్రాథమిక ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. టీవీ, స్మార్ట్ఫోన్, లాప్‌టాప్ వంటి పరికరాల స్క్రీన్ (సరఫేస్)ను కావలసిన రంగులోకి మార్చుకునే టెక్నాలజీని యువ శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. ఈ టెక్నాలజీ వల్ల ఇప్పుడు టీవీ తెర లేదా స్మార్ట్ఫోన్‌లలో దృశ్యాలు మరింత స్పష్టంగా తిలకించే సౌకర్యం ఏర్పడుతుంది. రిమోట్‌తో మనం ఛానల్స్ మార్చినట్లే స్పష్టత కోసం స్క్రీన్ రంగులను మార్చుకోవచ్చు. ఈ టెక్నాలజీకి సంబంధించిన నిర్వహించిన ప్రయోగాలు అనుకున్నట్లే ఫలితాన్నిచ్చాయి. అయితే మరికొన్ని పరీక్షల తరువాత దీని పూర్తి ఫలితం ప్రకటిస్తారు. వివిధ ఎలక్ట్రానిక్ డివైస్‌ల స్క్రీన్‌లపై ఇప్పుడున్న దృశ్య స్పష్టతకన్నా మూడురెట్టు ఎక్కువ నాణ్యతను ఈ టెక్నాలజీతో సాధించవచ్చు. ఫోన్, టీవీ లేదా ఇతర డివైజ్‌లలో ఫొటోలు, దృశ్యాలను చూడాలంటే లక్షలాది వివిధ రంగులతో కూడిన ఫిక్సల్స్ సమాహారంగా కనిపించాలి. ప్రతి ఫిక్సల్ ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగుల సబ్‌ఫిక్సల్స్‌తో ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే మనకు ఆ దృశ్యం స్పష్టంగా గోచరిస్తుంది. ప్రస్తుతం ఆయా ఫిక్సల్స్ కలర్‌ను ట్యూన్ చేయడంపై పరిశోధకులు దృష్టి సారించారు. ముఖ్యంగా యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాకు చెందిన పరిశోధకులు కొన్ని ప్రయోగాలు చేపట్టారు. అంటే రిమోట్‌తో ఆయా సబ్‌ఫిక్సల్స్ రంగులను మార్చడం అన్నమాట. వివిధ స్థాయిలలో వోల్టేజ్‌ను ఎక్కువతక్కువ చేస్తూ వాటి రంగులను మార్చే టెక్నాలజీని వారు కనిపెట్టారు. ప్రతి ఫొటో లేదా దృశ్యంలో ఉండే ఆర్‌జిబి (రెడ్, గ్రీన్, బ్లూ) సబ్ ఫిక్సల్స్‌లో ఏ రంగు ఫిక్సల్స్‌నైనా మనకు కావలసిన రంగులోకి మార్చుకోవడం ఇక సాధ్యం. కావలసిన రంగులోని సబ్ ఫిక్సల్‌ను మనకు కావలసిన రంగులోకి మార్చుకోవడం ఎలాగో వారు కనిపెట్టారు. ఈ పరిశోధనల్లో పాలుపంచుకుంటున్న భారత సంతతి శాస్తవ్రేత్త దేబాషిస్ చాంద ఈ పరిశోధనల వివరాలు చెప్పారు. టీవీ, ఇతర మాధ్యమాలలో కన్నా వర్చ్యువల్ రియాలిటీ కార్యక్రమాలను అందించే డివైజ్‌లలో కంటికి దగ్గరగా ఉండే తెరలపై దృశ్యాలు స్పష్టంగా ఉండాలి. అలాంటివాటికి ఈ సరికొత్త టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందిదని మరో శాస్తవ్రేత్త డేనియల్ ఫ్రాంక్లిన్ చెప్పారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆర్‌జిబి సబ్‌ఫిక్సల్స్ అవసరం లేని విధానం అందుబాటులోకి వచ్చినట్లేనని వారంటారు. అంటే ఏ ఫిక్సల్‌నైనా తమకు నచ్చిన రంగులోకి వోల్టేజ్ నియంత్రణ ద్వారా మార్చుకునే వెసులుబాటు ఈ టెక్నాలజీతో ఉంటుంది. అంటే ఇక సబ్‌ఫిక్సల్ అవసరమే ఉండదు. అందువల్ల ఆ టెక్నాలజీవల్ల కనిపించే బుల్లితెర లేదా దృశ్యం ఎంతో స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఒక నానోస్ట్రక్చర్ ఉపరితలంపై వారు చేసిన ప్రయోగంతో వారు ఈ సిద్ధాంతాన్ని ప్రకటించారు. నేచర్ కమ్యూనికేషన్స్ అన్న జర్నల్‌లో వారు ఈ మేరకు ఓ వ్యాసాన్ని ప్రచురించారు. ఈ టెక్నాలజీ కోసం ప్రస్తుతం ఉన్న డిస్‌ప్లే టెక్నాలజీని మార్చడం లేదా మార్పులు చేయాల్సిన అవసరమే లేదని వారంటున్నారు. *