యువ

పక్షులను తరిమేసే రోబర్డ్ ద్రోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డేగలాంటి ఆకారంతో కనిపించే ఈ రోబర్డ్ ద్రోన్ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించే ఇతర పక్షులను తరిమేస్తుంది. విమానాశ్రయాల చుట్టుపక్కల ఇతర పక్షులు విహరించకుండా, ఆయా ప్రాంతాల్లో పక్షులు గూళ్లు అల్లుకోకుండా ఇది వాటిని నియంత్రిస్తుంది. ఎయిర్‌ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో వీటిని ప్రయోగించినపుడు అదే సమయంలో అక్కడ ఎగురుతున్న నిజమైన పక్షులను ఇవి బెదరగొడతాయి. అచ్చం డేగల్లా కనిపించడం, వాటిని అనుకరించే శబ్దాలను వెలువరించడం ద్వారా ఆ ద్రోన్ వాటిని చెదరగొడతాయి. అమెరికాలోని ఎడ్‌మాంటన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవలే వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అద్భుతమైన ఫలితాలు కనిపించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నా రు. అన్‌మాన్‌డ్ ఏరియల్ సిస్టమ్‌గా దీనిని పేర్కొన్నారు. క్లియర్ ఫ్లైట్ సొల్యూషన్ సంస్థ, ఏరియమ్ అనలైటిక్స్ సంస్థ కలసి ఈ రోబర్డ్ ద్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాయి.