యువ

మాట కలిపింది.. శుభ్రత నేర్పింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పుట్టింది చండీగఢ్‌లో..
చదివింది ఢిల్లీలో..
పనిచేస్తున్నది కర్నాటకలో...
ఆమె చేస్తున్నది ఉద్యోగం కాదు.. సేవాకార్యక్రమం..
ఆరుబయటకు వెళ్లి అవసరాలు తీర్చుకునే ఓ పల్లెజనం అలవాటను మాన్పించి, మరుగుదొడ్ల అవసరాన్ని చెప్పి, వారిని మార్చిన ఆమె పేరు ఉష్మా గోస్వామి. ఈ 23 ఏళ్ల యువతి అసలు లక్ష్యం యుపిఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణురాలవడం. ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించడం. అంతకన్నా ముందు ఓ గ్రామంలో స్వచ్ఛ్భారత్‌గా మార్చేయాలన్నది లక్ష్యం. ఆమె కలను దాదాపుగా సాకారం చేసుకుంది ఆమె. మొదట్లో ప్రజల నుంచి మద్దతు లభించక వెనుదిరిగివెళ్లిపోవాలనుకున్న ఆమె ఇప్పుడు వెళ్లిపోదామన్నా ఊరు వెళ్లద్దంటోంది. అంతగా ఆమె ఆ ఊరివారిని మార్చేసింది. అదెలా సాధ్యమైందో తెలుసుకోవలసిందే..
ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఉష్మా గోస్వామి యుపిఎస్‌సి ఉద్యోగాల కోసం సాధన చేస్తోంది. ఉద్యోగం వచ్చేలోగా సమాజానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంది. పల్లెపట్టుల్లో ఉండే సామాజిక, ఆర్థిక, కులమత, సంపన్న, బలహీన వర్గాల తారతమ్యాలను దగ్గరగా చూసి ఆ తేడాలను రూపుమాపడం ఎలాగో తెలుసుకోవాలనుకుంది. అది చేయాలంటే ఏదైనా పల్లెకు వెళ్లాలనుకుంది. ఈలోగా, అంటే 2016 ఆగస్టులో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యూత్ ఫర్ ఇండియా ఫెల్లోషిప్‌కు ఎంపికైంది. ఏడాదిపాటు ఓ ఎన్‌జిఒ సంస్థతో కలసి ఆమె ఓ పల్లెటూళ్లో పనిచేయాలన్నమాట. ‘్ధన్’ (డిహెచ్‌ఎఎన్) అనే స్వచ్చంద సంస్థలో చేరింది. చండీగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఆమె కర్నాటకలోని మైసూరు జిల్లా బి. సీహళ్లి పంచాయతీకి చేరింది. ఇది బన్నూరు బొలి గ్రామం పరిథిలో ఉంటుంది. మొదట గ్రామమంతా తిరిగింది. ఆమె భాష వారికి, వారి భాష ఆమెకు అర్ధం కాలేదు. పంచాయతీ కార్యాలయంలో పారాలీగల్ కార్యాలయాన్ని తెరిచింది. కానీ ఎవరూ వచ్చేవారు కాదు. నవంబర్ వరకు చూసింది ఎవరినుంచి స్పందన రాలేదు. ఇక ఇంటికి వెళ్లిపోదామనుకున్న వేళ ఓ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. అక్కడ పిల్లలు ఆమెకు చేరువయ్యారు. ఈలోగా ధన్ వలంటీర్ కన్నడ నేర్చుకోమని సలహా ఇచ్చారు. ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నెమ్మదిగా భాషపై పట్టు సాధించింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించింది. మాటామాటా కలిపింది. ఎవరి ఇళ్లలోనూ మరుగుదొడ్లు లేవని గుర్తించింది. ఆరుబయట మలమూత్ర విసర్జన వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించింది. తక్కువ వ్యయంతో టాయ్‌లెట్లు కట్టుకునే అవకాశాలను వివరించింది. ఆమెగురించి విన్న సమీప గ్రామం కొడగహళ్లి నుంచి వచ్చిన కొందరు మరుగుదొడ్లు కట్టుకునేందుకు సహకరించాలని కోరారు. దీంతో సమూలమార్పు సంభవించింది. ఒకరి తరువాత మరొకరు అలా మరుగుదొడ్లు కట్టుకోవడం మొదలెట్టారు. దాని ఫలితాలు అందరికీ అర్ధమయ్యాయి. ఇప్పటివరకు అలా ఆ రెండు గ్రామాలలో 75 టాయిలెట్లు కట్టించిందామె. తను వెళ్లేలోగా అంటే మరో రెండునెలల్లో 200 టాయిలెట్లు పూర్తవ్వాలన్నది ఆమె లక్ష్యం. మొదట్లో తనను ఎవరూ పట్టించుకునేవారు కాదని, ఇప్పుడు తను ఎక్కడికివెళ్లినా వారి కుటుంబ సభ్యురాలిగా చూస్తూ ఆదరిస్తున్నారని అంటోంది ఉష్మా గోస్వామి.

చిత్రాలు.. ఉష్మా గోస్వామిని అభినందిస్తున్న మహిళలు

*ఉష్మా గోస్వామి ప్రోత్సాహంతో నిర్మించిన మరుగుదొడ్డి