యువ

ప్రమాదాల మధ్య ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం 17 సంవత్సరాల ఆర్యన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు. ఇక్కడే ఉంటూ నాసాతో కలసి పనిచేస్తున్నాడు. తల్లి చదువుకోలేదు. తండ్రి హైస్కూల్ చదువుతో సరిపెట్టుకున్నాడు. తనకేమో సైన్స్ ఇష్టం. వారికి ఇవేవీ తెలిసేవి కావు. అతడి ఆలోచనలకు ఎప్పుడూ మద్దతు లభించలేదు. కొందరి సహాయంతో 20వేల రూపాయల విలువైన టెలిస్కోప్ కొనుక్కోగలిగాడు. వివిధ ప్రయోగాల కోసం విదేశాలకు వెళితే తిరిగొచ్చేందుకు డబ్బుండేది కాదు. సరికొత్త ఆస్టరాయిడ్స్‌కోసం వెతికే పనిలో స్పష్టమైన దృశ్యం కోసం హిమాలయాలకూ వెళ్లాడు. ఉత్తరాఖండ్ కొండలను ఎక్కాడు. లోయల్లోకి జారిపోయాడు. చాలాసార్లు కాళ్లూచేతులూ విరిగాయి. ఓసారి ఉత్తరాఖండ్‌లో పులిదాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చివరకు అనుకున్నది సాధించిన ఆర్యన్, అతడి మిత్రుడు కీర్తివర్ధన్, మరికొంత మిత్రులతో కలసి తన పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అతడి ఇల్లు ఇప్పుడు ఓ ఖగోళశాస్త్ర గనిలా ఉంటుంది. ఈమధ్యే సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్‌ను సందర్శించాడు. అక్కడి రాకెట్ ప్రయోగ వేదికలను పరిశీలించే అవకాశం దక్కించుకున్నాడు. పదకొండేళ్ల వయసులో అంటే 2011లో తొలిసారిగా టెలిస్కోప్‌లో శని గ్రహానికి సంబంధించిన రంగుల వలయాలను చూసి సంభ్రమానికి గురయ్యానని చెబుతాడు ఆర్యన్. అప్పటి నుంచి ఎన్నో వింతలు విశేషాలు చూశానని గుర్తు చేసుకుంటూంటాడు.

చిత్రం.. ఆర్యన్