యువ

కాలితో కంట్రోల్ చేసేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇళ్లలో ఉండే కొళాయిలను ఆన్ చేసి చేతులు కడుక్కోవడం లేదా పాత్రలు శుభ్రం చేసుకోవడం అందరికీ అలవాటే. తడి చేతులతో మళ్లీ టాప్ ఆఫ్ చేయాల్సి రావడం, టాప్ పైభాగం మురికికావడం మామూలే. మనం టాప్ కట్టేలోగా కొంత నీరు వృధా అవడం పరిపాటే. అలా నీటిని వృధా కానివ్వకుండా, టాప్ శుభ్రంగా ఉండేవిధంగా ఓ అధునాత సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. టాప్స్ ఉన్నచోట దిగువ భాగంలో అందంగా అమర్చే టాప్‌పెడల్ అమర్చుకోవచ్చు. టాప్ ఆన్ చేయాలనుకున్నప్పుడు ఆ పెడల్‌పై ఒకవైపు కాలితో అదిమితే నీళ్లు పడతాయ్. రెండోవైపు అదిమితే టాప్ ఆఫ్ అవుతుంది. ఈ ఎకోపాడ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది కూడా. మన కరెన్సీలో దాదాపు రెండు వేల రూపాయలకు ఇది లభ్యమవుతుంది.