యువ

‘స్మార్ట్’ ఆటలతో మాటలు ఆలస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక విజ్ఞానం తెచ్చిన ఆధునిక సౌకర్యాలు ఎంత ఉపయోగకరంగా ఉంటున్నాయో అంతే దుష్ప్రభావాలనూ చూపిస్తున్నాయి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లల ఎదుగుదల చూస్తున్న తల్లిదండ్రులు మురిసిపోవడం మామూలే. బుడిబుడి అడుగులు వేసినా, తడబడి మాటలు పలికినా వారి చేష్టల్ని చూసి ముచ్చటపడనివారు ఉండరు. కానీ ఆధునిక జీవనశైలిలో ప్రతిఒక్కరి జీవితంలోకి చొరబడిపోయిన స్మార్ట్ఫోన్లు, ఐపాడ్ వంటి డివైజ్‌లు చిన్నారుల ఎదుగుదలపై పెనుప్రభావానే్న చూపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి రెండేళ్ల వయసులో ఉండే పిల్లలపై ఇవి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. రెండుమూడేళ్ల చిన్నారులను ఆకర్షించడానికి, వేరేపనుల్లో మునిగితేలే పెద్దలు వారికి ఐఫోన్లు, స్మార్ట్ఫోన్లు, లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవ్వడం ఈ రోజుల్లో మాములైపోయింది. ఈ ఏడాది జరిగిన పీడియాట్రిక్ అకడమిక్ సొసైటీ సమావేశంలో ఈ అంశంపై సునిశిత, గుణాత్మక విశే్లషణ జరిగింది. వీటికి అలవాటుపడిన పిల్లల్లో సాధారణంగా ఈ అలవాటు లేని పిల్లలు మాట్లాడే వయసుకన్నా ఆలస్యంగా మాట్లాడుతున్నారని ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. దాదాపు 900 పిల్లలను, వారి ఎదుగుదలను పరిశీలించిన నిపుణులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ఆరునెలల నుంచి రండేళ్ల లోపు చిన్నారులపై స్మార్ట్ఫోన్లు, ఐపాడ్‌లు, ఇతర గాడ్జెట్లు అలవాటు చేయడం వల్ల వాటు మాట్లాడగలగడంపై ప్రభావం చూపుతోందన్నది వారి నిర్ధారణ. రోజుకు 30 నిమిషాలపాటు అలా స్మార్ట్‌డివైజ్‌లను వినియోగించిన చిన్నారుల్లో మాట్లాడగలగడంపై 49 శాతం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందన్నది వారి అంచనా. ముఖ్యంగా శబ్దం చేయడం, మాట్లాడటం మరింత ఆలస్యం అవడానికి ఇవి పరోక్షంగా కారణమవుతాయన్నది వారి అంచనా. అయితే వారి శరీరభాష, హావభావాల ప్రదర్శన, అందరికీ చేరువకావడం వంటి లక్షణాలపై ఈ గాడ్జెట్లు ఎటువంటి వ్యతిరేక ప్రభావం చూపవన్నది వారి అభిప్రాయం. కేవలం మాటలు రావడం ఆలస్యమవడమే వీటివల్ల కలిగే నష్టమన్నది వారి స్పష్టమైన అభి ప్రాయం. అయితే ఈ అంశాన్ని రూఢీ చేసుకునేందుకు మరింత విస్తృతమైన పరిశీలన అవసరమని పీడియాట్రిక్ నిపుణులు సూచిస్తున్నారు. 18 నుంచి 24 నెలల లోపు ఉన్న చిన్నారులకు ఈ స్మార్ట్ డివైజ్‌లను అలవాటు చేయకపోవడమే మేలని, ఆ తరువాతైనా తమ పర్యవేక్షణలోనే వాటిని ఉపయోగించేలా చూడాలని యువ తల్లిదండ్రులకు వారు సలహా ఇస్తున్నారు. పిల్లలతో ఎక్కువసేపు గడపడం, వారితో మాట్లాడటం, వారు మాట్లాడేలా వ్యవహరించడం, వారితో ఆటలాడటం వంటి చర్యలవల్ల పిల్లలు తొందరగా మాట్లాడగలుగుతారని వారు సూచిస్తున్నారు. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం ఈ స్మార్ట్ డివైజ్‌లు పిల్లలను ‘స్మార్ట్’గా తయారు చేయడం లేదన్నమాట. *