యువ

సెహ‘బాస్’ అనిపించుకోవడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగం రావడం చాలా తేలిక, కాని దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టమనేది నిర్వివాదాంశం. అత్యంతవేగంగా మారిపోతున్న సమాచార సాంకేతక విజ్ఞాన రంగంలో క్షణకాలం క్రితం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మరుక్షణం మారిపోతోంది. కాలం పరుగులు పెడుతున్న వేగానికి మించి మనం పరుగులుపెట్టినపుడే కాలానికి ధీటుగా బదులివ్వగలుగుతాం. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది, మరో పక్క సామాజిక మాధ్యమాలు వెల్లువెత్తాయి. మనకు తెలిసింది ఫేస్‌బుక్, ట్విట్టర్ మాత్రమే అయినా, ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా సామాజిక మాధ్యమాలు పనిచేస్తున్నాయి. మీడియా ఒక వైపు, సమాజం మరో వైపు ఒత్తిడి పెంచుతోంది. ఒకపుడు నేర్చుకున్న విద్యతో సరిపెట్టుకునేవారు సుద్దపప్పు మాదిరి అదే కుర్చీల్లో కూర్చుంటుండగా, ఏ రోజుకా రోజు కౌశలాలు అందిపుచుక్చుకుంటూ , నైపుణ్యాలను పెంచుకుంటూ, తర్ఫీదు పొందుతున్న వారు లాంగ్ జంప్ చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు ఇట్టే చేరుకుంటున్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా వేగం ఒడిసిపట్టుకుని ముందుకు సాగుతున్న వారే ‘బాస్’ల ఆశీస్సులు పొందగలుగుతున్నారు. వారినే సెహ‘బాస్’ అంటున్నారు. ఇందుకు చేయాల్సింది చాలా ఉన్నా, కొద్ది పాటి కృషి, శిక్షణ, ఆసక్తి, నిజాయితీ ఉంటే చాలు పదరపదసోపానపటంలో ఉన్నత శిఖరానికి చేరుకోవడం చాలా ఈజీ.
గొప్ప లక్ష్యాలను మనసులో ఉంచుకుని, అందుకు తగ్గట్టు అవసరమైన కౌశలాలు పొందుతూ నిజాయితీగా వ్యవహరిస్తూ, నిర్భీతిగా తన మనసులోని భావాలను చెప్పగలిగితే చాలు మిమ్మల్ని విజేతల్లో ఒకరిగా పరిగణించవచ్చు. చలాకీగా ఉంటే చాలు ఇలా ఉంటే ఎలా ఎదుగుతారు అంటూ ప్రశ్నించేవారు ఎపుడూ ఉంటారు. వారందర్నీ పక్కన పెట్టేయండి, మీ పని మీరు చక్కగా చేయండి చాలు. కష్టపడి చేయాల్సిన పనిని ఇష్టపడి పనిచేస్తూ, మీరు చేస్తున్న పనినే ఎదుటివారికి వివరించి చెప్పండి. పనిలో ఉత్సాహం చూపించండి, కష్టాన్ని చెప్పండి, సాధించిన దానిని వివరించండి. అపుడు మీరు ఏం చేస్తారో , ఏం చేయగలుగుతారో ఎదుటివారికి అర్ధం అవుతుంది.
ఉద్యోగం చేయడం అంటే, మీ పని మీరు చేయడంతో సరిపోదు. నలుగురితో కలిసి పనిచేయడం, నలుగురు చేయాల్సిన పనిని సమన్వయం చేయడం, అందరి విజయాన్ని కలిసికట్టుగా ఆస్వాదించడం. అపుడే మీరంతా కేవలం ఉద్యోగులుగానే కాదు, బాస్‌లుగా అనిపించుకునే అర్హత పొందుతారు. సిబ్బందికి తెలియంది చెప్పడం, మరింత తేలికగా పనిని పూర్తిచేసుకునే టెక్నిక్‌లు అందించడం, ఒత్తిడిని పక్కన పడేసి హాయిగా సంతోషంగా, నవ్వుకుంటూ పనిని పూర్తిచేసే సౌలభ్యాన్ని సహచరులకు కల్పించడం ద్వారా మీ పనితీరులోని వినూత్నత్వాన్ని మిగిలిన వారు కూడా గుర్తించగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం. మీ సత్తా చూపేందుకు సిద్ధం కావడమే తరువాయి.

-బి వాగ్దేవి