యువ

వీళ్లు సిగరెట్ పీకలు కొంటారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వచ్ఛ్భారత్’ కోసం ప్రభుత్వాలు భారీగా ప్రచారం చేస్తున్నా, దండిగా నిధులు వెచ్చిస్తున్నా ఫలితం అంతంత మాత్రమేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా పర్యావరణ పరిరక్షణకు ఇద్దరు యువకులు నడుం బిగించి ‘్భళా’ అన్పించుకుంటున్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం ఈ ఇద్దరూ రోడ్లెక్కి చీపుళ్లు పట్టరు.. చెత్త ఏరుకునే వారిలా కన్పించకపోయినా అపరిశుభ్రతను అంతం చేసేందుకు శ్రమిస్తారు.. ధూమపాన ప్రియులు కాల్చిపారేసే సిగరెట్ పీకలను ఏరిపారేయడమే వీరి ధ్యేయం.
సిగరెట్లు తాగేవారు చాలామంది ఆ పని ముగిశాక వాటి పీకలను (్ఫల్టర్లు) రోడ్డుపై పడేసి చెప్పులతో నలిపేస్తారు. ఈ సిగరెట్ పీకలు భూమి పొరల్లో ‘డీ కంపోజ్’ కావడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందని హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన విశాల్ కాంత్, నమన్ గుప్తా అంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇప్పటికే పర్యావరణానికి ప్రమాదం ఏర్పడగా, సిగరెట్ పీకల వల్ల ఆ ముప్పు మరింత తీవ్రతరం అవుతోందని వీరు ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విశ్వవ్యాప్తంగా ప్రతిరోజూ టన్నుల కొద్దీ సిగరెట్ పీకలు భూమిపై పేరుకుంటున్నాయి. ఈ పీకలు మట్టిని తినేయడంతో భూసారం దెబ్బతింటోంది. మన దేశంలోనే ఒక్క ఏడాదిలో రోడ్డుపై పారేసే సిగరెట్ పీకల సంఖ్య వంద బిలియన్లుగా ఉంటోందట! కేవలం బెంగళూరు మహానగరంలోనే రోజుకు దాదాపు 31 లక్షల సిగరెట్ పీకలను రోడ్డుపై పడేస్తున్నారట! ఓసారి ఓ విందు సందర్భంగా వెళ్లిన ఈ ఇద్దరికీ అక్కడ వందలకొద్దీ సిగరెట్ పీకలు కనిపించాయి. వీటి వల్ల దుర్వాసన, అపరిశుభ్రత పెరిగిపోతోందని గ్రహించి పర్యావరణ పరిరక్షణకు ఏదో ఒకటి చేయాలని వీరు సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే సిగరెట్ పీకలు ఎక్కడా కనిపించకుండా చేయాలని విశాల్, నమన్ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వీధుల్లో పారేసే సిగరెట్ పీకలను ‘రీ సైక్లింగ్’ చేస్తే కొంతలో కొంతైనా పర్యావరణాన్ని కాపాడవచ్చని వీరు ‘కోడ్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు.
రోడ్లవెంట పడి సిగరెట్ పీకలను ఏరడం ద్వారా సమస్యను నిర్మూలించలేమని గ్రహించిన విశాల్, నమన్ చివరికి ఓ పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. సిగరెట్ పీకలను భారీగా సేకరించి తమకు అందజేస్తే, నగదు ఇచ్చి కిలోల లెక్కన వాటిని కొంటామని వీరు ‘ఆఫర్’ ఇచ్చారు. చాలా పాన్‌షాప్‌ల వద్ద సిగరెట్ పీకలను వేసేందుకు డబ్బాలు ఏర్పాటు చేశారు. కిలో సిగరెట్ పీకలను సేకరించి ఇచ్చే వారికి 700 రూపాయలు చెల్లిస్తున్నారు. తక్కువ సేకరించి ఇచ్చిన వారికి కూడా ఎంతో కొంత నగదు ఇస్తున్నారు. పది పదిహేను రోజులకోసారి వీరు సిగరెట్ పీకలను కొంటారు. ఈ సంగతి తెలిశాక ధూమపాన ప్రియుల్లో కూడా చైతన్యం వస్తోంది. సిగరెట్ పీకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పాన్ షాపుల వద్ద డబ్బాల్లో వేస్తున్నారు. ఏభై మంది పాన్‌షాప్ యజమానులు, వందమంది వరకూ ధూమపాన ప్రియులు కూడా విశాల్, నమన్‌లకు సహకరిస్తున్నారు. సిగరెట్ పీకల ఏరివేతకు ప్రారంభించిన ‘కోడ్’ ఉద్యమాన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరింపజేయాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. శాస్ర్తియ పద్ధతుల్లో సిగరెట్ ‘్ఫల్టర్ల’ను రీ సైక్లింగ్ చేస్తున్నామని, తాము చేస్తున్న పని పర్యావరణ పరిరక్షణకు కొంతైనా దోహదపడుతుందని వీరు అంటున్నారు. సిగరెట్ పీకల్లోని పొగాకు, కాగితం, ఫిల్టర్ భూమిలో ‘డీ కంపోజ్’ కాకపోవడం వల్లే పర్యావరణం దెబ్బతింటోందని తాము చేపట్టిన ప్రచార ఉద్యమానికి స్పందన బాగానే ఉందని ఈ ‘మిత్రద్వయం’ సంతృప్తి చెందుతోంది.

చిత్రం.. విశాల్ కాంత్, నమన్ గుప్తా