యువ

‘రణవిద్య’లోనూ రాణించిన సంధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తళుకులీనుతూ ‘ర్యాంప్’ మీద కదలాడిన ఆ మెరుపుతీగ.. ఇపుడు కరాటే విన్యాసాలతో పతకాలను, ప్రశంసలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఒకప్పుడు తన అందచందాలతో ‘్ఫ్యషన్ షో’ల్లో అదరగొట్టిన ఆ మోడలింగ్ భామ నేడు యుద్ధవిద్యలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ముంబయికి చెందిన సంధ్యా శెట్టి 2000 సంవత్సరంలో తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘ర్యాంప్ వాక్’లోనే కాదు, వివిధ స్థాయిల్లో జరిగిన అందాల పోటీలకు హాజరైంది.
జీవితంలో ఏదైనా సాధించాలని అందరి లాగే కాలేజీ రోజుల్లో ఆమె కూడా భావించింది. న్యాయవాదిగా లేదా దేశ రక్షణ రంగంలో సేవలు అందించాలని ఆమె ఆశపడింది. అయితే, అనుకోకుండా ఆమె ఆలోచనలు మొదట్లో మోడలింగ్ వైపు మళ్లాయి. బంధుమిత్రుల ప్రోత్సాహంతో ‘ఫెమినా మిస్ ఇండియా’ వంటి అందాల పోటీల్లో సంధ్య పాల్గొని ప్రశంసలు అందుకుంది. టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు, ర్యాంప్ షోలు వంటి అనేక ఈవెంట్లలో పాల్గొంది. మోడలింగ్‌లో స్థిరపడాలని భావిస్తున్న ఆమె దృష్టి అనుకోకుండా ‘మార్షల్ ఆర్ట్స్’పై పడింది. తొలిసారి ఓ కరాటే ప్రదర్శనను తిలకించినపుడు పోటీలో పాల్గొన్నవారు గాయపడడం చూసి ఆమె ఆందోళన చెందింది. కొట్టుకోవడం, రక్తం చిందడం... ఇవేం పోటీలు? అంటూ భయపడింది. అయితే, ఇలాంటి రణవిద్యలో అమ్మాయిలు ఎందుకు సత్తా చాటరాదు? అని తనను తాను ప్రశ్నించుకుంది. దాంతో ఆమె దృక్పథంలో మార్చు వచ్చింది. ఫలితంగా కరాటే తరగతులకు వెళ్లడం ప్రారంభించింది. ఎలాంటి కష్టం లేని మోడలింగ్‌ను వదలి, క్లిష్టతరమైన కరాటే పట్ల ఆమె ఆసక్తి చూపడాన్ని సన్నిహితులు విమర్శించారు. కరాటే విన్యాసాలంటే క్యాట్‌వాక్ అంత సులువుకాదని కొందరు చేసిన వ్యాఖ్యలను సవాలుగా తీసుకుంది సంధ్య. ర్యాంప్ మీద హొయలొలికించడమే కాదు... కష్టతరమైన రణవిద్యలోనూ మహిళలు రాణించాలని చెప్పే ఆమె కరాటేలో నైపుణ్యం సాధించేందుకు కఠోర శిక్షణ తీసుకుంది. ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ ఎదగాలని చెప్పడమే కాదు, ఆ మాటలను ఆచరణలో పాటించింది. 2007లో మహారాష్ట్ర స్టేట్ కరాటే చాంపియన్‌గా నిలిచిన సంధ్య ఆ తర్వాత ఎన్నో పోటీల్లో పాల్గొని విజయాలను నమోదు చేస్తోంది. మహిళలకు ఆత్మరక్షణ, విద్య, ఆర్థిక స్వేచ్ఛ అవసరమని, వీటిని సాధించాలంటే కాలం విలువను తెలుసుకుని క్రమశిక్షణతో నడచుకోవాలని ఆమె చెబుతోంది. కరాటే కారణంగా క్రమశిక్షణ, సమయపాలన వంటివి అలవడుతాయని వివరిస్తోంది. వేళకు నిద్ర లేవడం, రాత్రి పూట త్వరగా నిద్ర పోవడం, తగినంత శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులు పాటించినట్లయితే మహిళలు ఏ రంగంలోనైనా నైపుణ్యం చాటుతారని సంధ్య తన మనసులోని మాట చెబుతోంది.

చిత్రం.. కరాటే విన్యాసాలు చేస్తున్న సంధ్య