యువ

ఓ ‘విజేత’ ఘనత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెన్త్, ఇంటర్ వంటి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడైతే చాలు.. ‘టాప్ ర్యాంకుల్ని తమ విద్యార్థులే కైవసం చేసుకున్నారని, అధిక శాతం ఉత్తీర్ణతతో తామే అగ్రగామిగా నిలిచామని కానె్వంట్లు, కార్పొరేట్ కాలేజీలు, కోచింగ్ సంస్థలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో చేసే హడావుడికి అంతేలేదు. అయితే, అందరి దృష్టినీ ఆకర్షించాలనుకున్న ఓ కుర్రాడు తన వింత ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. ముంబయిలోని దాదర్‌కు చెందిన సాహిల్ సందీప్ కర్లే టెన్త్ పరీక్షల్లో 55 శాతం మార్కులు సాధించాక ‘విజయ గర్వం’తో నడివీధుల్లో బ్యానర్లు కట్టాడు. క్లాసులో ‘వెనక బెంచీ విద్యార్థి’గా ముద్రపడిన సాహిల్ టెన్త్ పరీక్షల్లో గట్టెక్కుతాడని ఎవరూ ఊహించలేదు. ఇతను తొమ్మిదో తరగతిలో ఉండగా తండ్రిని కోల్పోయాడు. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇతని చదువుపై అంతగా ఆసక్తి చూపలేదు. ఓ దుకాణంలో కాపలాదారుగా పనిచేస్తూనే టెన్త్ పరీక్షల్లో ఎలాగైనా విజయం సాధించాలని సాహిల్ చదువుపై దృష్టి పెట్డాడు. ‘నువ్వేం పాసవుతావులే..’ అంటూ మిగతా విద్యార్థులు హేళన చేసినా పట్టించుకోకుండా పరీక్షలకు సన్నద్ధం అయ్యాడు. 55 శాతం మార్కులతో పరీక్ష పాసయ్యాక, ఆ విషయం చుట్టుపక్కల వారందరికీ తెలియాలని నడివీధిలో బ్యానర్లు కట్టాడు. బ్యానర్ల సంగతెలా ఉన్నా, బాగా చదివి అనుకున్నది సాధించినందుకు సాహిల్‌ను స్థానికులే కాదు, ‘వాట్సాప్’ మిత్రులు కూడా అభినందనలతో ముంచెత్తారు.