యువ

ఇల్లు మారడం ఇక ఈజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న పట్టణమైనా, పెద్ద నగరమైనా ఇల్లు మారాలంటే నిజంగా భారీ ప్రహసనమే.. ఎవరైనా ఇల్లు మారాలంటే అనేక వ్యయప్రయాసలు భరించక తప్పని రోజులివి.. తమకు అనువైన ప్రాంతంలో, అందుబాటులో ఉండే అద్దెకు ఇల్లు దొరకడం అంటే మాటలా..? ఇంటిని వెదకడం, అద్దె విషయంలో బేరసారాలు, అడ్వాన్సులు ఇచ్చుకోవడం, సామాన్లంటినీ ప్యాక్ చేసుకోవడం, కొత్త ఇంట్లో చేరడం.. ఇలా వివిధ దశలను అధిగమిస్తేనే గానీ ‘ఇల్లు మారడం’ అసాధ్యం. ఒకప్పుడు ‘ఇల్లుకట్టి చూడు.. ఎన్ని బాధలో తెలుస్తాయి..’ అనేవారు. ఇపుడు ఆ మాటను కాస్త సవరించి- ‘ఇల్లు మారి చూడు’ అంటున్నారు. ఈ పరిస్థితులను ‘క్యాష్’ చేసుకునేందుకే నగరాల్లో ‘రెంటల్ ఏజెన్సీలు’ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మధ్యవర్తులకు, దళారీ పాత్ర పోషించే రెంటల్ ఏజెన్సీలకు భారీగా సమర్పించుకున్నా ఇల్లు మారేవారికి అన్నీ సవ్యంగా జరుగుతాయన్న గ్యారంటీ లేదు. ఇలాంటి కష్టనష్టాలను స్వయంగా అనుభవించిన దిల్లీ కుర్రాళ్లు అతుర్ అగర్వాల్, పీయూష్ గుప్తా ‘ఇల్లు మారే వారి’ కోసం ‘్ఫ్లట్‌హుడ్’ పేరిట ఓ వినూత్న స్టార్టప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
మిత్రులైన అతుర్, పీయూష్ వేరే ‘స్టార్టప్’ పనుల కోసం దిల్లీలోని మాల్వియా నగర్‌లో ఓ ఇంటి కోసం తెగ అనే్వషించారు. దళార్లను కలిసినా, రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్లను గాలించినా వారికి సరైన వసతి దొరకలేదు. దీంతో విసుగెత్తిన ఆ ఇద్దరూ కలిసి ఓ పరిష్కార మార్గం కోసం అనే్వషించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘్ఫ్లట్‌హుడ్’ స్టార్టప్‌ను వారు ఆవిష్కరించారు.
అద్దె ఇంటి కోసం అనే్వషిస్తున్న వారికి ‘్ఫ్లట్‌హుడ్’ ఇపుడు కొండంత అండగా నిలుస్తోంది. ‘ఇల్లు మారడం’ పేరిట రోజుల తరబడి కొనసాగే ప్రహసనానికి తెర పడిందని అతుర్, పీయూష్ చెబుతున్నారు. కుటుంబాలకు, బ్రహ్మచారులకు, దంపతులకు, ఒంటరి జీవులకు.. ఇలా అన్ని రకాల వారికి అనువైన ఇంటిని చూపించడమే కాదు, వారి సామగ్రిని భద్రంగా కొత్త ఇంటికి చేర్చడం, అవసరమైన వారికి గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటివి సమకూర్చడం... వీటన్నింటికీ ఒకే ప్యాకేజీ ధర.. పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి చేరేవరకూ అన్ని సేవలనూ ‘్ఫ్లట్‌హుడ్’ ద్వారా అందిస్తున్నారు. అద్దె ఇళ్లకు సంబంధించి బ్రోకర్ల దందా ఎక్కువగా ఉందని, రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్లలో పాత సమాచారమే ఉంటోందని, సరైన వివరాలు ఎక్కడా లభించనందున ‘ఇళ్ల వేట’లో ఇక్కట్లు తప్పడం లేదని అతుర్, పీయూష్ చెబుతున్నారు.
మన దేశంలోని పట్టణాలు, నగరాల్లో దాదాపు 35 శాతం మంది అద్దె ఇళ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. పనులు మానుకొని, ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఇంటి కోసం అనే్వషించాల్సి ఉంటుంది. తీరా ఇంత కష్టపడ్డా అనుకూలమైన చోట, అనువైన అద్దెకు ఇల్లు దొరకడం గగన కుసుమమే. బ్రోకర్లకు అడిగినంత ఇచ్చినా ఫలితం ఉంటుందన్న గ్యారంటీ లేదు. మన దేశంలో ఇప్పటికే అనేక రెంటల్ స్టార్టప్స్ రంగ ప్రవేశం చేసినా అవి జనం నుంచి భారీగానే దండుకుంటున్నాయి. మరో మూడేళ్ల నాటికి దేశంలో రెంటల్ మార్కెట్ 180 బిలియన్ డాలర్లు దాటుతుందని ఓ అంచనా. అంతా వ్యాపార మయం అయిన ఈ రోజుల్లో డబ్బు ఖర్చయినా సేవలు సంతృప్తికరంగా ఉంటాయన్న భరోసా లేదు. ఈ నేపథ్యంలోనే ఇంటిని సమకూర్చడమే కాదు, సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది ‘్ఫ్లట్‌హుడ్’ స్టార్టప్. ఇంటి ఓనర్లకు, అద్దెకు ఉండేవారికి అవసరమైన సేవలను అందించడంతో తమకు డిమాండ్ పెరిగిందని అతుర్, పీయూష్ చెబుతున్నారు. ప్రస్తుతం దిల్లీ, గుర్గావ్‌లో లభిస్తున్న తమ సేవలను ఇతర ప్రాంతాలకూ విస్తరింపజేయాలన్నదే తమ ఆలోచన అంటున్నారు. పెద్ద మొత్తంలో అద్దె చెల్లించలేని వారికి ‘రూమ్ మేట్స్’, ఫ్లట్‌మేట్స్’ను కూడా వీరు వెతికిపెడుతుంటారు.