యువ

యువత కోసం మోదీ పుస్తకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని యువతకు దిశానిర్దేశం చేస్తూ ప్రత్యేక పుస్తకం రాస్తున్న తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ మరో రికార్డును సృష్టిస్తున్నారు. నేటి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ, వాటికి తగిన పరిష్కారమార్గాలను కూడా ఆయన తన పుస్తకంలో సూచిస్తారు. పరీక్షల ఒత్తిడిని జయించడం, ఏకాగ్రతను సాధించడం, చదువు పూర్తయ్యాక కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం.. ఇలాంటి అంశాలపై ప్రధాని మోదీ యువతకు తన పుస్తకంలో సూచనలు, సలహాలు రాస్తారు. పలు భారతీయ భాషల్లో వెలువడే ఈ పుస్తకం ఈ ఏడాది చివరి నాటికి యువతకు అందుబాటులో ఉంటుంది. ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ఈ పుస్తకాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. విద్యార్థులు అనునిత్యం ఎదుర్కొనే అనేకానేక సమస్యలకు ఇందులో పరిష్కార మార్గాలు ఉంటాయి. విద్యార్థి దశలో అత్యంత కీలకమైన టెన్త్, ‘ప్లస్ టూ’ తరగతుల వారిని దృష్టిలో ఉంచుకుని ఈ పుస్తకాన్ని మోదీ రాస్తున్నారని ‘పెంగ్విన్ రాండమ్ హౌస్’ ప్రతినిధి చెబుతున్నారు. ఈ పుస్తకం విద్యార్థులకు ‘నిజమైన మిత్రుడి’గా మార్గదర్శనం చేస్తుందని, ముఖ్యంగా పబ్లిక్ పరీక్షల్లో యువత సత్తా చాటేందుకు దోహదపడుతుందని ప్రధాని భావిస్తున్నారని ప్రచురణ సంస్థ అంటోంది.
‘మన్ కీ బాత్’లో ప్రేరణ..
‘మార్కుల కంటే జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి.. భవిష్యత్ కోసం యువత బాధ్యతతో ప్రవర్తించాలి.. ఈ విషయాలను యువతరం నిండుమనసుతో గుర్తించాలి.. దీని కోసం నేను సైతం ఏదో ఒకటి చేయాలి..’- ఇలా కొన్నాళ్లు తీవ్రంగా ఆలోచించిన ప్రధాని మోదీ చివరికి- యువత కోసం ఓ పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి నెలా ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ద్వారా ప్రజలతో అనుసంధానం అవుతున్న సందర్భంగా యువత సమస్యలపై మోదీ తీవ్రంగా ఆలోచించేవారు. తన ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వాలని సంకల్పించారు. కేవలం సలహాలు, సూచనలే కాదు.. తన అనుభవాలను, కొన్ని ముచ్చట్లను యువతతో పంచుకునేందుకు ‘పుస్తకం’ సరైన వేదిక అని ఆయన భావించారు.
‘నా హృదయాన్ని అనునిత్యం తాకుతున్న ఓ విషయానికి సంబంధించి ఏదో రాయాలన్న తపన.. నా దృక్కోణంలో అత్యంత ముఖ్యమైన యువత కోసం కలం పట్టాలి.. భవిష్యత్ రోజుల్లో ఈ దేశాన్ని నడిపే యువతరం సరైన మార్గంలో నడవాలి..’ అని భావించిన మోదీ ఇప్పటికే తన ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడం ప్రారంభించారు. మోదీ రాస్తున్న పుస్తకానికి ‘బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ సాంకేతిక అంశాల్లో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చింది.
దేశంలోని యువతకు మంచి సందేశం ఇచ్చేందుకు ఓ పుస్తకం రాయాలని మోదీ సంకల్పించడంతో, ఆ ప్రయత్నంలో తమ వంతు కృషి చేసేందుకు అంగీకరించామని ‘పెంగ్విన్ రాండమ్ హౌస్’ సిఇఓ గౌరవ్ శ్రీనగేష్ చెబుతున్నారు. దేశాన్ని సరికొత్త పథంలో తీసుకువెళుతున్న మోదీ- యువతను ప్రోత్సహించేందుకు, తగిన దిశానిర్దేశం చేసేందుకు చొరవ చూపడం అభినందనీయమని ఆయన అభివర్ణించారు. మోదీ ఆకాంక్షల మేరకు యువతను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించేలా తమ వంతు సహకారం ఉంటుందని గౌరవ్ తెలిపారు. ఓ అరుదైన, అద్భుతమైన సంకల్పానికి నాంది పలికిన ప్రధాని మోదీ విద్యార్థులకు నేరుగా తన మనోభావాలను తెలిపేందుకు పుస్తక రచన చేయడం గొప్ప విషయమని ‘పెంగ్విన్ రాండమ్ హౌస్’ ఎడిటర్- ఇన్- చీఫ్ మిలీ ఐశ్వర్య అంటున్నారు. మోదీ రాస్తున్న పుస్తకానికి ఆమె సంపాదక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సామాజిక ప్రస్థానంలో తాను పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని, మోదీ పుస్తకం వల్ల భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల విద్యార్థులకు మేలు జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

- వౌని