యువ

‘పోలీస్ రోబో’ సృష్టికర్తలు మన కుర్రాళ్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏదైనా వస్తువు కొన్ని గంటల పాటు తన పక్కనే ఉంటే- అదేదో ‘అనుమానాస్పద వస్తువు’ అని దాని ఫొటోను తీసి ఆ రోబో సమీప పోలీస్ స్టేషన్‌కు ‘సర్వర్’ ద్వారా చేరవేస్తుంది.
* బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు వంటి జనసమ్మర్ధమైన ప్రదేశాలలో బాంబు పెట్టారని ఎవరైనా ఫోన్ చేస్తే చాలు.. ఆ ప్రాంతానికి పోలీస్ రోబోను తీసుకెళితే చాలు.. కొద్ది సెకన్లలోనే అక్కడ బాంబు ఉన్నదీ లేనిదీ తెలిసిపోతుంది.
* పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు మొహమాట పడేవారు, ‘మనకెందుకులే లేనిపోని రిస్క్’ అని భయపడేవారు ఆ రోబో వద్దకు వెళ్లి తమకు తెలిసిన సమాచారాన్ని ‘్ఫడ్’ చేస్తే చాలు.. పోలీస్ స్టేషన్‌లో ‘కంప్లయింట్’ ఇచ్చినట్టే. రోబోలో నమోదయ్యే ఫిర్యాదులన్నీ పోలీస్ స్టేషన్‌కు క్షణాల్లో చేరిపోతాయి. అలాగే, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి ‘జాతకాల’ను కూడా ఆ రోబో పోలీసులకు అందజేస్తుంది.
... క్లిష్టతరమైన విధి నిర్వహణలో పోలీసులకు ఇలా రోబో సేవలు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. మన దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసు శాఖ రోబో సేవలను ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి వినియోగించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసుల కోసం ఈ రోబోను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే అనేక దేశాల్లో రోబోలను ఆతిథ్యరంగంలో, ఆరోగ్య సేవల్లో వినియోగిస్తున్నారు. పలు దేశాల్లో భద్రతకు సంబంధించి కూడా రోబోలను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ పోలీసులు మాత్రమే రోబో సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రపంచంలోనే రెండో పోలీస్ రోబోను తయారుచేసిన ఘనత భారత్‌కే దక్కుతుంది. హైదరాబాద్‌కు చెందిన ‘హెచ్ బూట్స్ రోబోటిక్స్’ సంస్థ కొన్ని నెలల క్రితం పోలీస్ రోబో రూపకల్పనకు కసరత్తు ప్రారంభించి మంచి ఫలితాలను సాధించింది. ఈ సంస్థ సిఇఓ కిషన్, ఆయన వద్ద పనిచేస్తున్న యువకులు పోలీస్ రోబోను సృష్టించేలా తమ ఆలోచనలకు పదునుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కిషన్ సింగపూర్ వెళ్లి దుబాయ్ సంస్థ ప్రతినిధులను కలిసి రోబో రూపకల్పనకు సంబంధించి పలు విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే హైదరాబాద్ పోలీసుల కోసం ఓ రోబోను సృష్టించాలని సంకల్పించారు. దుబాయ్ రోబోలా కాకుండా మన స్థానిక అవసరాలకు అనుగుణంగా రోబోను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక చోట స్థిరంగా ఉండే ‘వీల్స్ రోబో’ కన్నా, నడిచే (వాకింగ్) రోబోను తయారు చేస్తే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావించారు. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయని తెలిసినా వాకింగ్ రోబోను రూపొందించేందుకు ‘హెచ్ బూట్స్’ సంస్థ సంకల్పించింది. ట్రాఫిక్ సమస్యలు, ఫిర్యాదులు, అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాల నిర్ధారణ వంటి విషయాల్లో ఈ రోబో సేవలు పోలీసులకు అందుబాటులో ఉంటాయి.
అక్టోబర్ నాటికి ఈ ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుందని, రెండు నెలల పాటు రోబో పనితీరును అంచనా వేశాక, డిసెంబర్ 31 నాటికి పోలీసు శాఖకు అప్పగించాలని భావిస్తున్నారు. ఆరోగ్య సేవలు, భద్రతా రంగంలో రోబోలను వినియోగించడం విశేషం కాకున్నా, తొలిసారిగా హైదరాబాద్ పోలీసులు రోబో సేవలను వినియోగించుకుంటే అది మన దేశానికే గర్వకారణం అవుతుంది.