యువ

కల్లోల సీమలో కొత్త చిగుళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుట్టూ బాంబులు పేలుతున్న శబ్దం.. సైనికుల బూట్ల చప్పుడుతో ఆ ప్రాంతం అట్టుడికిపోతున్నా.. అక్కడి యువతరంలో ఆనందానికి కొదవ లేదు. ఉగ్రవాదాన్ని వారు స్వాగతిస్తున్నారని కాదు.. తీవ్రవాదం అనే రాచపుండుతో వారు ఎన్ని బాధలు పడుతున్నా తమ ‘కెరీర్’పైనే దృష్టిసారించడమే ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్‌లో చాలాకాలంగా తీవ్ర వాద కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతుండడంతో అక్కడి యువత విద్య, ఉపాధి రంగాలకు దూరం అవుతున్నారు. పాక్ సైనికులే కాదు, ఆ దేశం నుంచి కశ్మీర్ సరిహద్దులలోకి చొరబడి వస్తున్న ఉగ్రవాదుల కాల్పులతో అనునిత్యం ఎక్కడో ఒకచోట హింస ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఉగ్రవాద కార్యకలాపాల ఫలితంగా కశ్మీర్‌లో కాలేజీలకు, యూనివర్శిటీలకు సెలవులు ప్రకటించక తప్పడం లేదు. క్లాసులు జరగడం లేదు, పరీక్షలు వాయిదాపడుతున్నాయి. దాంతో అక్కడి యువత ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. అది క్రీడారంగం. ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున బాలికలు ఫుట్‌బాల్ క్రీడలో రాణిస్తున్నారు. కాలేజీలు మూత పడినప్పటికీ, గ్రౌండ్‌కు వెళ్లి ఫుట్‌బాల్ ఆడుకుంటూ తమలో ఆశలను చిగురింపచేసుకుంటున్నామని అక్కడి విద్యార్థినులు చెబుతున్నారు. పరిస్థితులు అదుపులో లేకున్నా తమ క్రీడా నైపుణ్యాలకు మాత్రం సానబెడుతున్నాం అని వారంటున్నారు. ఏదో కాలక్షేపం కోసం ఆడడం కాదు, ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొని అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచి ఘన విజయాలను నమోదు చేస్తున్నారు. కశ్మీర్‌లో పరిస్థితులను, స్థానిక రాజకీయాలను పట్టించుకోకుండా తమ పనిని వారు చేసుకుంటూ పోతున్నారు. వనరులు ఉన్నా లేకున్నా సర్దుకుంటూ విజయాలను నమోదు చేయడమే లక్ష్యంగా అంకితమవుతున్నారు. కొంతమంది శిక్షణ కోసం ఇంటి నుండి గ్రౌండ్‌కు చేరుకునేందుకు కూడా సిఆర్‌పిఎఫ్ సహకారం తీసుకుంటున్నారు. ఇంట్లో వారు- ‘ఇంత హింసలో బయటకు ఎందుకు వెళ్లడం?’ అని అడ్డుకుంటున్నా యువతులు తమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో చూస్తే అన్ని మతాల వారితో పాటు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కనిపిస్తుంటారు. ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్‌ఐటి, యూనివర్శిటీల నుండి వచ్చిన విద్యార్థులు సైతం కనిపిస్తున్నారు. రంగురంగుల క్రీడా దుస్తుల్లో వారిని చూస్తుంటే భారతదేశం ఒక చోటకు చేరిందా? అనిపిస్తుంది. ఐఐటిల్లో సీట్లు సాధించేందుకు వీలుగా శిక్షణ ఇస్తున్న సూపర్ -30 తరహాలో ఒక ఫుట్‌బాల్ బృందాన్ని రూపొందించి మంచి శిక్షణ ఇవ్వడానికి అధికారులు సైతం ఆసక్తి చూపారు. దీంతో ఉగ్రవాదం వైపు మొగ్గు చూపకుండా, యువతీ యువకులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు దృష్టి సారించారు.

- బీవీ