యువ

అకుంఠిత దీక్షతో అఖండ ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగతా ఆటల మాదిరి అది సులభమైనది కాదు.. చాలా కఠినమైనది అయినా నిరంతర దీక్షతో, అలుపెరుగని కృషితో ఆమె అద్భుతాలను సాధిస్తోంది.. అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తోంది.. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన 18 ఏళ్ల అన్నం తరంగిణి విలక్షణమైన ‘సెపక్‌తక్రా’ క్రీడలో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో సత్తా చాటింది. చేతులతో కాకుండా కాలితో, తలతో బంతిని ప్రత్యర్థుల కోర్టులోకి నెట్టడం ఈ ‘సెపక్‌తక్రా’లో క్లిష్టతరమైన అంశం.
ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తన తండ్రి వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతో 2006లో తెలంగాణ స్టేట్ స్పోర్ట్సు స్కూల్‌లో చేరిన తరంగిణి 2009 నుంచి సెపక్‌తక్రాలో మెళకువలను నేర్చుకుంది. 5.3 అడుగుల ఎత్తుండే ఆమె కాలితో బంతిని ప్రత్యర్థుల కోర్టులోకి నెట్టడంలో నేర్పరి.
ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ సెపక్‌తక్రా పోటీల్లో భారత్‌కు కాంస్య పతకం దక్కడంలో తరంగిణి ఎంతో నైపుణ్యం ప్రదర్శించింది. ఇప్పటివరకూ తొమ్మిది అంతర్జాతీయ పోటీల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె జాతీయ స్థాయి పోటీలో తెలంగాణ రాష్ట్రానికి పతకాలను సాధించి పెట్టింది. ఇరవై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న తరంగిణి 2018లో జరిగే ఆసియా క్రీడల్లో మన దేశానికి పతకం ఖాయమని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. జాతీయ స్థాయిలో సీనియర్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్ పోటీల్లో రెండుసార్లు ఆమె కాంస్య పతకాలను సాధించింది. ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు భారత జట్టులో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారిణిగా తరంగిణి రికార్డు సృష్టించి తెలంగాణకు వనె్న తెచ్చింది. కింగ్ కప్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకం, కాంస్య పతకం, బీచ్ ఆసియా పోటీల్లో రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకోవడంలో ఆమె భాగస్వామ్యం ప్రశంసనీయం. జాతీయ స్థాయిలో ఆరు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను తరంగిణి తన ఖాతాలో వేసుకుంది. ఎంత కష్టపడినా తమకు స్పానర్ల నుంచి, ప్రభుత్వం నుంచి తగిన ఆదరణ లేదని ఆమె అంటోంది. సెపక్‌తక్రా ఆటకు ఒలింపిక్ క్రీడల్లో స్థానం కల్పించాలని, ఈ క్రీడలో ప్రతిభావంతులకు ప్రభుత్వం రాయితీలను, ప్రోత్సాహకాలను, ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆమె కోరుతోంది.