యువ

నాణాలే ప్రాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతసేపూ మార్కులు, ర్యాంకులపై తప్ప వ్యక్తిగత హాబీలపై ఆసక్తి చూపని ఈ కాలం కుర్రకారుకు ఆ యువకుడు నిజంగా స్ఫూర్తిదాతే. మంచి అభిరుచులకు, మానసిక వికాసానికి అంతగా అవకాశం లేని నేటి ‘డిజిటల్ యుగం’లో ఇంకా ‘నాణాల సేకరణ’ వంటి హాబీలు ఉన్నాయంటే మనం కాస్త విస్మయం చెందాల్సిందే. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే హాబీలపై ఈ కాలపు యువతకు మమకారం తగ్గుతోంది. తల్లిదండ్రులు, పెద్దల ప్రోత్సాహం లేకపోవడం కూడా ఇందుకు కారణమే. ఉన్నత చదువులు, కెరీర్‌తో పాటు మంచి హాబీలు తోడుంటే వ్యక్తిత్వ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయని నిపుణలు చెబుతున్నా పట్టించుకోని పరిస్థితి నేడు నెలకొంది. ఇందుకు భిన్నంగా అరుదైన నాణాల సేకరణకు విలువైన కాలాన్ని, కోట్లాది రూపాయల ధనాన్ని ఖర్చు చేస్తూ విలక్షణ యువకుడిగా నిలిచాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీష్ ధమేజా. అరుదైన నాణాలను సేకరించడంలోనే కాదు, లెక్కకు మించి డిగ్రీలు, పీజీలు చేయడంలోనూ మనీష్ రికార్డు సృష్టించాడు. మనీష్ వైద్యుడిగా పేరు తెచ్చుకోవాలని అతని తండ్రి, ఇంజనీర్‌గా స్థిరపడాలని తల్లి కలలు కనేవారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు చేరువ కావాలని మనీష్ భావించేవాడు. రాజస్థాన్ విద్యాపీఠ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసినా అతనికి జ్ఞానతృష్ణ తీరలేదు. ఓ ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరినా కొన్నాళ్లకు అతనిలో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది. 2008లో విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించిన ఓ నెట్‌వర్క్ ప్రాజెక్టులో చేరాడు. 2010లో దక్షిణాఫ్రికాలో ఆ తర్వాత టాంజానియా, జాంబియా, మడగాస్కర్,కెన్యా, సెనగల్ వంటి విదేశాల్లో విద్య, ఆరోగ్య రంగాల్లో పనిచేశాడు. ఎంత చదివినా, ఎన్ని చోట్ల పనిచేసినా అతనికి ఉద్యోగం అంటే చివరికి ‘బోర్’ అనిపించింది. దీంతో నాణాల సేకరణపై మనీష్ దృష్టి సారించాడు. కొన్ని వందల శతాబ్దాల నాటి అరుదైన నాణాలను సేకరించేందుకు డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశాడు. సంపన్న వ్యాపార కుటుంబం కావడంతో ఈ ‘ఖరీదైన హాబీ’ని కొనసాగిస్తున్నాడు. మనీష్ ముత్తాతకు కూడా నాణాల సేకరణ హాబీ ఉండేది. అదే అభిరుచితో మనీష్ ఆస్తిపాస్తులను కరిగిపోతున్నా అధైర్య పడకుండా నాణాల సేకరణే తన ధ్యేయమని చెబుతున్నాడు. నాణాల సేకరణకు అవసరమయ్యే డబ్బు కోసం తమ పూర్వీకులకు చెందిన 30 గదుల భారీ బంగళాను సైతం అమ్ముకోవలసి వచ్చినా అతను చలించలేదు. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన హాబీని వదులుకోనని ఆత్మవిశ్వాసం ప్రకటించడం అతనికి అలవాటైంది. వివిధ కాలాలకు చెందిన సుమారు లక్ష నాణాలను సేకరించిన మనీష్ ఇప్పటికే గిన్నిస్ రికార్డు, లిమ్కా రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సు, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్సు, రికార్డ్ హోల్డర్స్ రిపబ్లిక్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు, యూకె, వరల్డ్ రికార్డ్స్ ఇండియా, స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్సులో గుర్తింపును పొందాడు. అరుదైన నాణాలపై పరిశోధన చేసి ‘డాక్టరేట్’ సంపాదించాలని, పురాతన నాణాలకు సంబంధించి ప్రపంచంలోనే తొలి ‘త్రీడి న్యుమిస్మాటిక్ మ్యూజియం’ను ఏర్పాటు చేయాలని ఆ దిశగా మనీష్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. ఇంజనీరింగ్‌తోనే చదువుకు ‘్ఫల్‌స్టాప్’ పెట్టకుండా 31 ఏళ్ల వయసులోనే ఎనిమిది పీజీలు, రెండు డిగ్రీలు, ఆరు సర్ట్ఫికెట్ కోర్సులను పూర్తి చేశాడు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్ని కోర్సులు చదివినా తన తొలి ప్రాధాన్యం నాణాల సేకరణకేనని, ఇందుకోసం ఎన్ని ఒడిదుడుకులనైనా ఎదుర్కొంటానని మనీష్ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాడు.

చిత్రం.. మనీష్ ధమేజా