యువ

‘ఎనీటైమ్’ వచ్చేస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రూప్ చాటింగ్, మెసెంజర్, గేమ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఫొటో-వీడియో షేరింగ్.. ఒకటేమిటి..? నేటి యువతకు అవసరమైన ఎన్నో ఫీచర్లతో ఓ సరికొత్త ‘యాప్’ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. స్మార్ట్ఫోన్‌లో పదుల సంఖ్యలో ‘యాప్స్’ అందించే ఫీచర్లను ఆ ఒక్క ‘యాప్’ అందజేస్తుంది. ఇ-కామర్స్ దిగ్గజమైన ‘అమెజాన్’ ఆవిష్కరించే ఈ వినూత్న మెసేజింగ్ యాప్ నేటి కుర్రకారును అలరించబోతోంది. ‘ఎనీటైమ్’ పేరిట రంగప్రవేశం చేసే ఈ సరికొత్త సోషల్ మెసేజింగ్ యాప్‌లో మొబైల్ నెంబర్‌కు బదులు ‘యూజర్ నేమ్’తో మనం స్నేహితులను అనే్వషించుకోవచ్చు.
‘వాట్సాప్’కు మించిన ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయట. స్మార్ట్‌వాచీల్లోనూ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చట. ఫేస్‌బుక్ మెసెంజర్, టెలీగ్రామ్, హైక్, జొమాటో, ఫ్రీచార్జి వంటి సోషల్, ఈ-కామర్స్ యాప్స్‌లోని సౌకర్యాలన్నీ ‘ఎనీటైమ్’ అందిస్తుందని అమెజాన్ ప్రకటించింది. ‘వాట్సాప్’లో లేని విధంగా ‘ఎనీటైమ్’లో గ్రూప్ వీడియో చాటింగ్‌ను ‘ఫేస్‌బుక్’ మెసెంజర్ మాదిరి చేసుకునే వీలుంది.
ఫొటో, వీడియో షేరింగ్‌లో వైవిధ్యం ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్, లైవ్ లొకేషన్ షేరింగ్, మినీ గేమ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, స్ప్లిట్ షేర్ వంటి ఫీచర్లు సైతం ఉన్నందున ‘ఎనీటైమ్’ రంగప్రవేశం చేస్తే ‘వాట్సాప్’ను మించి ఆదరణ చూరగొంటుందని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి.