యువ

మార్పు కోసం నడక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెటింగ్ నిపుణురాలిగా హాంగ్‌కాంగ్‌లో భారీ సంపాదనను తృణప్రాయంగా వదలిపెట్టి ఆమె మాతృదేశంపై మమకారంతో భారత్‌కు తిరిగొచ్చింది. మన దేశంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలకు మీడియాలో మితిమీరిన ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోందని ఆమె అంటోంది. సాధికారతకు మహిళలు దూరం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆమె విశే్లషిస్తోంది. మహిళల స్థితిగతుల్లో కొంతైనా మార్పు తేవాలన్న ఉద్దేశంతో- 3,800 కిలోమీటర్ల మేర ‘నడక యాత్ర’ సాగించాలని ఆమె సంకల్పించింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన సృష్టి భక్షి హాంగ్‌కాంగ్‌లో మూడేళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదలిపెట్టి సుదీర్ఘ నడక యాత్రకు సన్నాహాలు చేస్తోంది. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకూ సుమారు 3,800 కిలోమీటర్ల దూరాన్ని నడచి, ఆరు రోజులకోసారి విరామం తీసుకుని మహిళల కోసం వర్క్‌షాపులను నిర్వహించాలని ఆమె నిర్ణయించింది. తన నడక యాత్రకు భర్త, కుటుంబ సభ్యులు ఎంతగానో మద్దతునిస్తున్నారని, సెప్టెంబర్ 15న నడకను ప్రారంభిస్తానని సృష్టి ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం గుర్గావ్‌లో జరిగిన అత్యాచార ఘటన తనను ఎంతగానో కలచివేసిందని, భారత్‌కు తిరిగివచ్చి మహిళల కోసం ఏదైనా చేద్దామని అప్పుడే నిర్ణయించుకున్నానని సృష్టి తెలిపింది. మహిళల పట్ల పెచ్చుమీరుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాల గురించి వింటూంటే తీవ్ర ఆందోళనకు లోనై నిద్రలేని రాత్రిళ్లు గడిపానని ఆమె వివరిస్తోంది. మహిళలను సాధికారత దిశగా నడపాలన్న ఆకాంక్ష తీవ్రం కావడంతో నడక యాత్ర ప్రారంభించాని ఆమె నిర్ణయించుకుంది. తన నిర్ణయాన్ని తెలుసుకుని కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రోత్సహించారని సృష్టి సంతోషాన్ని వ్యక్తం చేసింది. డిజిటల్ మీడియా, ఆధునిక సాంకేతికత తోడైనపుడు మహిళలు కచ్చితంగా సాధికారతను, ఆర్థిక స్వేచ్ఛను సాధిస్తారని చెబుతోంది. దేశంలో బలంగా నాటుకున్న లింగ వివక్షకు, మితిమీరిన లైంగిక నేరాలకు నిరసనగా తాను నడక యాత్ర ప్రారంభిస్తున్నాని తెలిపింది. మహిళల స్థితిగతులు రాత్రికిరాత్రి మారడం అసాధ్యమని, మార్పు కోసం వేసే ప్రతి అడుగూ మంచి ఫలితం ఇస్తుందని అంటోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారని ఆమె చెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సామాజిక మీడియా తనకు ఎంతగానో ఉపకరిస్తుందని సృష్టి చెబుతోంది. తన నడక యాత్ర దేశవ్యాప్తంగా సుమారు 260 రోజుల పాటు సాగుతుందని, వారానికోసారి మహిళలకు నాలుగు గంటలసేపు వర్క్‌షాప్ ఉంటుందని ఆమె వివరిస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ వరకూ వివిధ సంస్కృతులు, భాషలకు చెందిన మహిళలను కలుసుకునేందుకు నడక యాత్ర దోహదపడుతుందని సృష్టి అంటోంది.

చిత్రం.. సృష్టి భక్షి