యువ

నడిస్తే పోయేదేం లేదు.. కొలెస్ట్రాల్ తప్ప!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంజన్‌కి అడపాదడపా ఓవరాలింగ్ ఎలా చేస్తారో అలాగే మన శరీరానికీ ఓవరాలింగ్ అవసరమే. అందుకు సరైన పద్ధతి వ్యాయామం. ఎక్సర్‌సైజులు ఇలాగే చేయాలీ అనేం లేదు. కొందరు జాగింగ్‌ను ఎంచుకుంటే మరికొందరికి రన్నింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు. ఇంకొందరికి యోగాపై మక్కువ కావచ్చు. ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే వయసును బట్టి వ్యాయామం ఉండాలి. సాధారణంగా యాభయ్యేళ్లకు పైబడినవారు రన్నింగ్ చేస్తే గుండె సంబంధిత జబ్బులకు లోనుకావచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కేలరీల రూపంలో కరిగిస్తే ఒంటికి నూతనోత్సాహం, ఉత్తేజం కలుగుతాయి.