యువ

ఐఐటిల్లో ఇక అమ్మాయిల హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక విద్యలో దేశంలోనే పేరెన్నికగన్న ఐఐటిల్లో ఇకపై అమ్మాయిల భాగస్వామ్యం గణనీయంగా పెరగనుంది. ఇప్పటి వరకూ ఐఐటి ప్రవేశాల్లో అబ్బాయిల ఆధిక్యం కొనసాగుతోంది. ఐఐటిల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతుల సంఖ్యను పెంచేందుకు ఇటీవల కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఓ కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించింది. సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్న బాలికలను గుర్తించి వారికి హైస్కూల్ స్థాయిలోనే ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జెఇఇ)కు తర్ఫీదు ఇవ్వాలని, ఇందుకు ఐఐటి ప్రొఫెసర్లు నేతృత్వం వహించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐఐటిల్లో అబ్బాయిల సంఖ్యకు సమానంగా అమ్మాయిలకు సీట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోటాను కేటాయించింది. ఈ నేపథ్యంలో ‘ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష’ (జెఇఇ)లో అమ్మాయిలు ప్రతిభా పాటవాలు చూపేలా సిబిఎస్‌ఇ ‘ఉడాన్’ పేరిట ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘ప్లస్ టూ’ (ఇంటర్మీడియట్)లో 70 శాతానికి పైగా మార్కులు సాధించిన బాలికలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా స్టడీ మెటీరియల్‌ను కూడా అందజేస్తారు. దీంతో జెఇఇలో అమ్మాయిలు మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘న్యూ ఇండియా’ అనే దృక్కోణంలో శ్రీకారం చుట్టిన ‘ఉడాన్’ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 135 మంది యువతులు జెఇఇ మెయిన్స్‌కు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా సుమారు 60 నగరాల్లో యువతులకు ‘ఉడాన్’ కింద శిక్షణ ఇస్తున్నారు. ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లలో చదువుకునేందుకు వీలుగా స్టడీ మెటీరియల్‌ను అందజేస్తున్నారు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు చెందిన యువతులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలని సిబిఎస్‌ఇ సంకల్పించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటిల్లో అడ్మిషన్ పొందుతున్న వారిలో 70 శాతం వరకూ అబ్బాయిలే ఉంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెస్తూ, ఐఐటిల్లో యువతులు సైతం మెరుగైన సాంకేతిక విద్యను అభ్యసించేందుకు ‘ఉడాన్’ పథకం ఉపకరిస్తుందని సిబిఎస్‌ఇ భావిస్తోంది.