యువ

సాఫ్ట్‌వేర్ నుంచి సాగులోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశంలో సంపాదనకు లోటు లేదు.. విలాసవంతమైన జీవితం.. గంటల తరబడి చెమటోడ్చి పనిచేయాల్సిన అవసరం లేనే లేదు.. దేనికీ లోటు లేకున్నా మనసులో ఏదో అసంతృప్తి.. ఏదో సాధించాలన్న ఆరాటం.. సొంతగడ్డపై అంతులేని మమకారం.. అందుకే- ఎవరేం అనుకున్నా పట్టించుకోకూడదనుకుని మంచి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశాడు.. సొంత ఊరికి చేరుకుని వ్యవసాయం మొదలుపెట్టాడు.. ఇదీ ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి, కర్షకుడిగా అవతారం ఎత్తిన సురేష్ విజయగాథ.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సురేష్ బిటెక్ చదివాక ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ సాధించి అక్కడే మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నెలకు ‘ఏడంకెల జీతం’ అతనికెందుకో సంతృప్తిని ఇవ్వలేదు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లతో అతనికి విసుగెత్తింది. సొంత ఊళ్లో పంటచేలు, పాడిపశువులు, పొలంలో మోటర్, ట్రాక్టర్, రైతుకూలీలు.. ఇవన్నీ పదే పదే గుర్తుకొచ్చి ఇక ఆస్ట్రేలియాలో ఉండలేక సొంత ఊరికి చేరాడు. మంచి ఉద్యోగం వదిలేసి వచ్చినందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిట్టినా అతనేం పట్టించుకోలేదు. సాఫ్ట్‌వేర్‌కు బదులు సాగురంగంలోనే తనకు ఆత్మసంతృప్తి ఉందని భావించి పొలం పనులు మొదలుపెట్టాడు.
వ్యవసాయం అంత సులభం కాదని తెలిసినా సుమారు 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రంగంలోకి దిగాడు. పంటలో తెగుళ్లు, ఎరువులు, పురుగుమందులు, వర్షాభావం, కూలీల కొరత వంటి సమస్యలు ఎదురైనా సురేష్ వెనుకడుగు వేయలేదు. వ్యవసాయం తనకు కొత్త అని తెలిసినా సొంత ఊళ్లో రైతులను కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకున్నాడు. మొదట్లో పోకచెట్లు, కొబ్బరి చెట్లు నాటడంతో బాగానే లాభాలు చవిచూశాడు. కరంటు కోతల సమయంలో సౌరశక్తిని వినియోగించి పొలానికి నీటిని మళ్లించాడు. ఎరువులు, క్రిమిసంహారక మందుల పేరిట అధిక పెట్టుబడులు పెట్టడం కన్నా సేంద్రియ వ్యవసాయం రైతులకు ఎంతో ప్రయోజనం అని తెలుసుకున్నాడు. సురేష్‌ను చూసి మిగతా రైతులు కూడా సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపారు. శాస్ర్తియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు వస్తాయని నిరూపిస్తున్న సురేష్ నుంచి మిగతా రైతులు స్ఫూర్తిని పొందుతున్నారు. తన కృషికి గుర్తింపుగా యువరైతు సురేష్ ‘యంగ్ ఎచీవర్’, ‘యంగ్ ప్రోగ్రెసివ్ ఫార్మర్’ వంటి పురస్కారాలను అందుకున్నాడు. హాయిగా బతకడానికి విదేశాల్లో మంచి ఉద్యోగమే అవసరం లేదని, ఆసక్తి ఉన్న రంగంపై దృష్టి పెడితే అద్భుతాలు సాధించవచ్చని సురేష్ నిరూపిస్తున్నాడు.