యువ

‘టీవీ షో’లు తగ్గించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లలో టీవీ షోలను అదేపనిగా వీక్షిస్తున్న యువత కాలాన్ని వృథా చేయడమే కాదు, అనేక శారీరక మానసిక సమస్యలకు లోనవుతున్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏకబిగిన టీవీ షోలను వీక్షిస్తున్న వారు నిద్రలేమి, అలసటకు లోనవుతున్నారని ల్యూవెన్ విశ్వవిద్యాలయం (బెల్జియం) పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు. రోజుకు మూడు నుంచి ఎనిమిది గంటల సేపు టీవీ షోలను చూస్తున్నవారిని ‘అతిగా వీక్షిస్తున్న వారి’గానే పరిగణించాలని, విరామం లేకుండా ఏకబిగిన వీక్షించడం ఏ మాత్రం మంచిది కాదని వారు సెలవిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు ఎనభై శాతం మంది తాము ఎక్కువ సమయం టీవీ షోలతో కాలక్షేపం చేస్తున్నట్లు అంగీకరించారు. 52 శాతం మంది మాత్రం తాము విసుగూ విరామం లేకుండా టీవీ షోలను తిలకిస్తున్నామని తెలిపారు. అతిగా టీవీ షోలను వీక్షిస్తున్న వారిలో 98 శాతం మంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారని అధ్యయనంలో తేల్చారు.
మితిమీరి టీవీ షోలను చూస్తున్నవారిలో ‘మేధోపరమైన అప్రమత్తత’ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. నిద్రలోకి వెళ్లిపోకుండా ఎకబిగిన టీవీ షోలు వీక్షించేందుకు ఈ ‘మేధోపరమైన అప్రమత్తత’ కారణభూతమవుతోందట! దీని నుంచి బయటపడాలంటే విశ్రాంతి తీసుకునేందుకు తగిన వైద్య సలహాలు అవసరమవుతాయి. కొన్ని ఆరోగ్య సలహాలు, చికిత్సలు పాటించినట్లయితే ‘మేధోపరమైన అప్రమత్తత’కు లోనుకాకుండా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఆసక్తికరమైన టీవీ షోలను అదేపనిగా చూడడం ఆరోగ్యానే్న కాదు, యువత కెరీర్‌ను కూడా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.