యువ

‘ఇ-ప్రచారం’.. ఓ వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య అనూహ్యంగా ఉండడంతో ఇ-కామర్స్ రంగం విస్తరిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇటీవలి కాలంలో స్నాప్‌డీల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థలు గణనీయంగా తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో ఆన్‌లైన్ ప్రచార రంగం యువతకు ఆశాకిరణమైంది. భారతీయులు వారంలో నాలుగు గంటల సేపు టీవీలతో కాలక్షేపం చేస్తుండగా, స్మార్ట్ఫోన్లతో వారంలో 28 గంటల సేపు గడుపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. రాబోయే మూడేళ్లలో స్మార్ట్ఫోన్ల వినియోగం అంచనాలకు మించి పెరుగుతుందని, ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 277 మిలియన్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోందంటే స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడమే కారణమని సర్వేలో తేలింది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో దాదాపు 80 శాతం మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నవారే కావడం గమనార్హం.
దేశంలో 87 శాతం వరకూ ప్రముఖ ఉత్పత్తి సంస్థలు ఆన్‌లైన్ మార్కెటింగ్ పట్ల ఆసక్తి చూపుతున్నాయని మార్కెటింగ్ విశే్లషణలో ప్రసిద్ధి చెందిన ‘సోషల్ బీట్’ సర్వే సంస్థ చెబుతోంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు ఉత్పత్తి చేసే సంస్థలే కాదు, హోటళ్లు,రెస్టారెంట్లు కూడా డిజిటల్ ప్రచారానికి మొగ్గు చూపుతున్నాయి. డిజిటల్ ప్రచారం కోసం పది శాతం బ్రాండెడ్ కంపెనీలు ఏడాదికి కోటి రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నాయి. దాదాపు 50 శాతం బ్రాండెడ్ కంపెనీలు ఆన్‌లైన్ ప్రచారానికి ఆరు లక్షలు చొప్పున వెచ్చిస్తున్నాయి. ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ సంస్థలు తమ ఉత్పత్తులపై ప్రచారానికి భారీగా నిధులను ఖర్చు చేస్తున్నాయి. సామాజిక మీడియాకు నానాటికీ ప్రాచుర్యం పెరగడంతో వివిధ కంపెనీల ఉత్పత్తులకు విశేష ప్రచారం లభిస్తోంది. ఫలితంగా ఆన్‌లైన్ మార్కెటింగ్ విస్తరిస్తోంది. ఒకప్పుడు బ్రాండెడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసేందుకు హోర్డింగ్‌లు, పత్రికలు- టీవీల్లో ప్రకటనలకు నిధులను ఖర్చు చేసేవి. ఇపుడు డిజిటల్ మార్కెటింగ్ వీటి ఉత్పత్తుల ప్రచారానికి సరికొత్త సాధనమైంది. ఇ-మెయిల్, బ్లాగులు, యూ ట్యూబ్, ఆన్‌లైన్ న్యూస్ చానళ్లు వంటి సుమారు పది రకాల మాధ్యమాలను డిజిటల్ మార్కెటింగ్‌గా పరిగణిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలే కాదు, నగరాల్లో రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్‌లు, జిమ్‌లతో పాటు ఆతిథ్యం , వినోదం అందించే సంస్థలు డిజిటల్ ప్రచారానికి మొగ్గు చూపుతున్నాయి. నానాటికీ ఊపందుకుంటున్న డిజిటల్ మార్కెటింగ్‌లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.
హోటళ్లు, రెస్టారెంట్లు, వినోదం, విజ్ఞానం తదితర రంగాలకు సంబంధించి ‘బ్లాగు’ల్లో ప్రచారం చేసేవారు సైతం మంచి ఆదాయం పొందుతున్నారు. వివిధ ఉత్పత్తులు, సేవలకు సంబంధించి ఆన్‌లైన్‌లో నిర్వహించే బ్లాగులు సైతం ఇపుడు ఆదాయ వనరులే. ఈ నేపథ్యంలోనే ఫుడ్ బ్లాగులు, ఫ్యాషన్ బ్లాగులు, టెక్నికల్ బ్లాగులు నిర్వహించే విద్యార్థులు, గృహిణులు సైతం మంచి ఆదాయం పొందేందుకు ఇపుడు అవకాశాలు మెండుగా ఉన్నాయని డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. ఉత్పత్తులకు సంబంధించి ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పేజీల ద్వారా కూడా కొందరు ఆదాయం సంపాదిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ మంచి ఉపాధి మార్గం కావడంతో రంగంలో శిక్షణ ఇచ్చే ప్రైవేటు సంస్థలకు సైతం డిమాండ్ పెరుగుతోంది.