యువ

మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరుగుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ నాటికి వీరి సంఖ్య 37కోట్లకు చేరుకున్నట్టు అంచనా. గత ఏడాది జూన్ నాటికి 23 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య ఏడాది కాలంలోనే 14 కోట్లు పెరగడం విశేషమే. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఎంఎఐ) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం 8.7కోట్లకు చేరుకుందట. వీరిలో 52 శాతం మంది వినోదం కోసమే ఇంటర్నెట్ చూస్తున్నారట. ఒక్క శాతం మంది మాత్రమే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నట్టు వెల్లడైంది.