యువ

సెలబ్రిటీలకు పాఠాలు నేర్పే పంతులమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యాక్టర్‌ను కాబోయి డాక్టర్ అయ్యా..’ అనే వారి సంఖ్య కంటే ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా..’ అనే వారి సంఖ్య మనం ఎక్కువగానే వింటుంటాం. ఒక వ్యక్తి ఏ రంగంలో రాణించాలనేది వారి ఆసక్తి, అభిరుచి, నైపుణ్యాలు, భాషావాక్చాతుర్యం, ఎదుటివారిని అర్థం చేసుకునే తీరు, తమపై తమకు ఉన్న నమ్మకం, శిక్షణ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏదో ఒక రంగంలో యథాలాపంగా అడుగుపెట్టి, మరో రంగంలో ఎదగడం అనేది సవాలుతో కూడుకున్న విషయమే! వేరే రంగంలో రాణించాలంటే అందుకు తగ్గ సత్తా ఉండాలి. అపుడే విభిన్న రంగమైనా రాణించే అవకాశం ఉంటుంది. కేవలం రాణించడమేగాక, ఆ రంగంలో నిష్ణాతులు కావాలంటే అది మరింత సవాలుతో కూడుకున్న అంశం.
అన్ని దశలూ దాటి వేరే రంగంలో స్పెషలిస్టుగా మారి, మిగిలిన వారికి మార్గదర్శకంగా మారడం అంటే అంతకంటే వరం వేరే ఏముంటుంది. జీవశాస్త్రంలో నిపుణులు కొంత మంది భాషా శాస్త్రంలో రాణిస్తుంటే, భాషా శాస్త్రంలో నిపుణులు జీవశాస్త్రంలో ‘ఔరా’ అనిపించుకుంటే ఇది ఓ రకమైన సంకరీకరణే. ఇదే పల్లవి సింగ్ విషయంలోనూ జరిగింది.
అందరి అమ్మాయిల మాదిరే దిల్లీకి చెందిన పల్లవి సింగ్ తన భవిష్యత్ మార్గాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవడానికి ముందే ఏం చదవాలో తెలియకుండానే గాలివాటం మాదిరి ఇంజనీరింగ్‌లో చేరింది. వాస్తవానికి ఆమెకు ఇంజనీరింగ్ చదవాలనే పెద్ద సంకల్పం ఏమీ లేదు. చదువు సాగుతుండగానే ఇంకోటి ఏదో చేయాలనే తలంపు, ఏం చెయ్యాలో తెలియని అయోమయం, మొత్తం మీద ఫ్రెంచి లాంగ్వేజి డిప్లొమోలో చేరింది. అది కూడా అనుకున్నంత సవ్యంగా ఏం సాగలేదు, వాస్తవానికి ఆ కోర్సును రూపకల్పన చేసిన తీరే పల్లవికి నచ్చలేదు, ఏదో యాంత్రిక శిక్షణలా అనిపించింది. వాస్తవానికి ఒక భాష నేర్చుకోవాలంటే అదే భాషలో నైపుణ్యం ఉన్న వారితో అనుదినం మాట్లాడుతుంటే తేలిగ్గా అబ్బుతుందనిపించింది. ఒక భాష నేర్చుకోవడంలో ఉన్న ఇబ్బంది, నేర్పిస్తున్న వారిలో లోపాలు, తేలికగా నేర్చుకునేందుకు ఉన్న మార్గాలు అపుడే పల్లవి బుర్రలోకి వచ్చేశాయి. విదేశీ భాషలు నేర్చుకున్నపుడు భారతీయులకు కలుగుతున్న ఆలోచనలే , విదేశాల నుండి భారత్‌కు వచ్చిన వారికి కూడా హిందీ నేర్చుకునే విషయంలో ఉండొచ్చు కదా! అనే ఆలోచన ఆమెకు వచ్చింది. ఆ ఆలోచన వచ్చీ రాగానే హిందీ నేర్చుకోవడం, మరో పక్క యూనివర్శిటీలో తాను బిటెక్ చేస్తుంటే వేరే కోర్సుల్లో చేరిన విదేవీ విద్యార్ధులకు హిందీ పాఠాలు చెప్పడం ప్రారంభించింది. అంతే.. ఏడాది తిరగకుండా తన మీద తనకే గట్టి నమ్మకం ఏర్పడింది. నియతమైన తరగతి గది అంటూ ఏమీ లేకుండానే ఏదో కాఫీ తాగుతూ, లాన్‌లో కూర్చుంటూ అత్యంత అనువైన ప్రదేశాల్లో తేలికగా ఇతరులకు హిందీ నేర్పడం మొదలుపెట్టింది. ఇంతలో చదువు కాస్తా పూర్తయింది. ఏం చేయాలనే మరో ఆలోచనలో సైకాలజీ చదవాలనుకున్న పల్లవి అందుకు వీలుగా ముంబైకి మారింది. ముంబై రాగానే అనుకోకుండా యుఎస్ కాన్సులేట్ కార్యాలయానికి ఒకసారి వెళ్లడం తన ప్రావీణ్యం గురించి చెప్పడం , యుఎస్ కాన్సులేట్ సిబ్బందికి హిందీ నేర్పించమనే ఆఫర్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.
టెడెక్స్‌లో సైతం ఉపన్యాసాలు ఇస్తున్న పల్లవి ఇక వెనుతిరిగి చూడలేదు. బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ మోడల్స్, దౌత్యాధికారులు, రాయబారులు, వివిధ విదేశీ కార్యాలయాల సిబ్బందికి ఆమె హిందీ పాఠాలు మొదలుపెట్టింది. ఎవరైనా ప్రముఖులైన ఇద్దరు విదేశీయుల పేర్లు చెబితే వారిలో ఒకరు ఆమె వద్ద హిందీ శిక్షణ పొంది ఉంటారంటే ఆశ్చర్యం లేదేమో. విలియం డార్లింపుల్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, నటాలియా డి లుసియా, లుసిండా నికోలస్ లాంటి విఖ్యాత నటీమణులకు ఆమె హిందీ బోధకురాలు. కనీసం 60 నిమిషాల పాటు 25రోజులు తన వద్ద పాఠాలు వింటే చాలు.. హిందీ మాట్లాడటం మొదలుపెడతారని గట్టి భరోసా ఇస్తోంది పల్లవి. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత వినియోగించుకున్నా, మానవ ప్రమేయంతో అభ్యాసం చాలా తొందరగా జరుగుతుందనడం నిర్వివాదాంశం అంటోంది పల్లవి.

- బివి ప్రసాద్