యువ

‘స్మార్ట్’ వ్యామోహంలో పయనం ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా? అయితే వారికి ఒక గ్రాము కొకైన్ ఇచ్చినట్లే!’’- అని ప్రముఖ ఎడిక్షన్ థెరపిస్టులు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.
ఇటీవల లండన్‌లో పాఠశాల విద్యార్థి నాయకులు, ఉపాధ్యాయుల కోసం ఒక సదస్సు జరిగింది. వారిని ఉద్దేశించి ప్రసంగించిన ఆ నిపుణులు- ‘‘నేడు చిన్నపిల్లల దగ్గర్నుంచి కళాశాల విద్యార్థుల వరకు స్నాప్ చాట్, ఇంస్టాగ్రామ్‌ల ద్వారా మెసేజీలు పంపడానికి విపరీతంగా అలవాటుపడిపోయారు. ఇది డ్రగ్స్, మత్తు పానీయాలకు బానిసలైనంతగా చాలా ప్రమాదకరమైనది’’ అని అన్నారు.
శిశు, కౌమార దశలలో ఉన్నవారిలో పెరుగుతున్న ‘టెక్నాలజీ దుర్వ్యసనం’ గురించి మాట్లాడుతూ ‘‘నేటి యువతరం స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ స్క్రీన్‌ల ఎక్కువ సమయం అతుక్కుపోతోంది’’ అని మాండీ సలిగరి అంటారు. ఈమె లండన్‌లోని హార్లీ స్ట్రీట్ చార్టర్ క్లినిక్‌లో స్పెషలిస్ట్.
‘‘మీరు మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ గానీ ఇస్తున్నారంటే వారికి ఓ గ్లాసు వైన్ లేదా ఓ గ్రాము కొకైన్ ఇస్తున్నట్లే. పిల్లలు గది తలుపులు మూసుకుని ఏది పడితే అది చూడటం మీకు సమ్మతమా? పిల్లల అలవాట్లు, వారి ప్రవర్తనపై మీకు నిజంగా ఆందోళన ఉంటే గనుక- వాళ్ళ స్మార్ట్ ఫోన్ వాడకం విషయంలో మీరు ఎందుకు దృష్టి పెట్టరు? అది కూడా వాళ్ళ మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కదా?’’ అని తల్లిదండ్రులను మాండీ ప్రశ్నిస్తున్నారు.
తన వద్దకు ఎక్కువగా 12-15 మధ్య వయస్సుగల పిల్లలు వస్తారని, స్మార్ట్ ఫోన్ వాడకం, ఇతర కార్యకలాపాల మధ్య వారిలో సంతులనం లేదనీ మాండీ అంటున్నారు. ‘‘పిల్లలు అదే పనిగా టాబ్లెట్ లేదా స్మార్ట్ ఫోన్లను చూస్తున్నప్పుడు అందులోని దృశ్యాలపైనే వారి దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. కానీ వారి కళ్లపై పడే కాంతి, వివిధ దృశ్యాలు వారి మెదడుపై చూపే ప్రభావం వల్ల వచ్చే పర్యవసానాల గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఎక్కువ సమయం వాళ్ళు కదలకుండా కూర్చునే ఉండడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వాళ్ళని చిన్నపుడే చుట్టుముడతాయి. అంతేకాదు, నెమ్మదిగా స్మార్ట్ ఫోన్ల వ్యసనంలో పడి వాళ్ళేం చేస్తున్నారు? ఇతరులతో ఏం మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అన్న విచక్షణనే కోల్పోతారు’’ అని ఆమె అంటారు.
స్మార్ట్ ఫోన్ వ్యసనం ఎంతవరకు వెళ్ళిందంటే కౌమార దశలోని పిల్లలు ఏ మాత్రం సంకోచం లేకుండా ‘సెక్స్టింగ్’ చేసుకుంటున్నారు. అంటే ఒకరికొకరు ఫోన్ల ద్వారా అశ్లీల చిత్రాలు, వీడియోలను, మాటలను పంపించుకుంటున్నారు. ఇది వాళ్లకి సర్వసాధారణమైపోయింది. ఇంటర్నెట్లో ఉండే ప్రతి అడ్డమైన వెబ్‌సైటూ వాళ్ళకి అందుబాటులోకి ఉంటోంది.
‘‘నా వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చే స్మార్ట్ ఫోన్ వ్యసనపరుల్లో మూడింట రెండు వందల మంది 16-20 సంవత్సరాల మధ్య వయస్కులే ఉంటారు. పదేళ్ళ క్రితం కన్నా ఇప్పుడు మరీ వీరి సంఖ్య చాలా పెరిగింది. అయితే ఇప్పుడు నా వద్దకు వచ్చే వ్యసనపరుల్లో ఇంకా చిన్న వయసు పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో చాలా మంది బాలికలు ‘సెక్స్టింగ్’ అనేది చాలా మామూలు విషయంగా భావిస్తున్నారు. అంతేకాదు, చాలామంది బాలికలు తమ నగ్న చిత్రాలను ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం తప్పుగా భావించడం లేదు. ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే తప్పని భావిస్తున్నారు.’’ అని మాండీ అంటున్నారు.
ఏప్రిల్, 2017లో ఇంగ్లండులో 15 వందల మంది టీచర్లను సర్వే చేశారు. వీరిలో ప్రతి ఆరింట ఒక్కరు ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నారు. ఈ సర్వేలో తెలిసిన విషయమేమిటంటే గత మూడేళ్ళలో రెండు వేలకు పైగా బాలబాలికలపై అశ్లీల చిత్రాలను స్మార్ట్ ఫోన్లలో షేర్ చేస్తున్న నేరాల సంఖ్య పోలీసుస్టేషన్లలో భారీగానే నమోదయ్యింది.
‘‘నిజానికి పిల్లల్లో ప్రబలుతున్న ఈ ధోరణి వాళ్ళ ఆత్మగౌరవానికీ, వాళ్ళ అస్తిత్వ గుర్తింపునకు సంబంధించినది. ఇతరులు తమను గుర్తించడానికి ఏం చేయడానికైనా వాళ్ళు సంకోచించడం లేదు. ఆ దశలో ఇది తప్పు, ఇది ఒప్పు అనే ఆలోచనే వారిలో కలగడం లేదు. పిల్లలకు ఆత్మగౌరవంతో బతకడం నేర్పిస్తే, వారిలో ఆరోగ్యకరమైన ఆలోచనా వికాసం కలిగిస్తే వాళ్ళని వాళ్ళు ఇతరుల ముందు తక్కువగా ప్రదర్శించుకోవడం మానేస్తారు’’ అని మాండీ అంటున్నారు. డాక్టర్ రిచర్డ్ గ్రాహం ‘‘నైటింగేల్ హాస్పిటల్ టెక్నాలజీ అడిక్షన్ లీడ్’’లో సైకియాట్రిస్ట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ‘పిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వ్యసనం ఇప్పుడు పరిశోధకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. స్మార్ట్ ఫోన్ వాడకానికి, ఇతర కార్యకలాపాలకి మధ్య పిల్లల్లో సంతులనం లోపించడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది’’ అని ఆయన అంటున్నారు.
స్మార్ట్ఫోన్లు లేదా టాబ్లెట్లతో గడిపే కాలాన్ని ‘‘స్ట్రీన్ టైం’’ అంటారు. 12-15 మధ్య వయస్సు పిల్లల్లో పెరిగిపోతున్న ‘‘స్క్రీన్ టైం’’ను తాము నియంత్రించ లేకపోతున్నామని పదిమందిలో నలుగురి కంటే ఎక్కువ తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పుడు మూడు నాలుగేళ్ళ వయస్సున్న పిల్లలు కూడా వారానికి సగటున ఏడు గంటలపాటు ఇంటర్నెట్ కోసం వెచ్చిస్తున్నారని బ్రాడ్ కాస్టింగ్ రెగులేషన్స్ అందించిన సమాచారం.
‘‘తల్లిదండ్రులు పిల్లలు వేళకు పడుకోవడం పట్ల శ్రద్ధ వహించాలి. అంతేకాదు, ఇంట్లో నియమిత వేళల్లో ‘డిజిటల్ కర్ఫ్యూ’ని విధించాలి. స్మార్ట్ ఫోన్లను దూరంగా వేరే వ్యాపకాలపై దృష్టి పెట్టేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. స్కూళ్లలో కూడా పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడటంపై మొదటి నుంచీ ఆంక్షలు విధించాలి’’ అని నిపుణులు అంటున్నారు.
‘‘పిల్లలు స్మార్ట్ ఫోన్లు లేదా టాబ్లెట్లకు అలవాటుపడుతున్న మొదటిదశలోనే గుర్తించి వాటికి వ్యసనపరులు కాకుండా తమని తాము ఎలా నియంత్రించుకోవాలో వివరించి చెప్పాలి. అంతేగాని, వాళ్ళ మీద నిఘా పెట్టినట్లు వ్యవహరిస్తే మనపై మొండి వ్యతిరేకతను పెంచుకుంటారు’’ అని మాండీ అంటారు.
డ్రగ్స్, మత్తు పానీయాలకు బానిసలయిన వారి కోసం నగరాల్లో కౌనె్సలింగ్ సెంటర్లు ఉంటాయి. తగిన కౌన్సిలింగ్ ద్వారా వారిలో మత్తుపదార్థాల వ్యవసనాన్ని తగ్గిస్తాయి. అలాగే స్మార్ట్ ఫోన్ల వ్యసనంలో మగ్గుతున్న యువతీ యువకుల కోసం మన దేశంలో బెంగళూరు,్ఢల్లీ నగరాలలో కౌనె్సలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇలాంటి సెంటర్లు ఒక్క చైనాలోనే 300 ఉన్నాయట. అంటే అక్కడ స్మార్ట్ ఫోన్ల పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో అర్థవౌతోంది. మన దేశంలో ‘స్మార్ట్’ కౌన్సిలింగ్ సెంటర్లయితే రెండు నగరాలలోనే ఉన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్ల పోన్లు లేనిదే రోజు గడపలేకపోతున్న యువతీ యువకుల సంఖ్య తక్కువేమీ కాదు. మరి తల్లిదండ్రులు సకాలంలో మేల్కొని తమ పిల్లల్ని కాపాడుకుంటారా?

- దుగ్గిరాల రాజకిశోర్ సెల్: 80082 64690