యువ

గురితప్పని బాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం పదకొండు నిమిషాల పందొమ్మిది సెకన్ల వ్యవధిలో ‘టార్గెట్’ వైపు ఏకంగా 103 బాణాలను సంధించి ఆ చిన్నారి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నిండా ఆరేళ్ల వయసు కూడా లేని చిన్నారి చెరుకూరి డాలీ శివాని విలువిద్యలో తనకు ఎదురే లేదని నిరూపిస్తోంది. 11 నిమిషాల్లో 103 బాణాలు సంధించిన తొలి వ్యక్తిగా ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో తన పేరు నమోదు చేసుకుంది. విజయవాడకు చెందిన శివాని గతంలో ఇరవై మీటర్ల దూరంలోని లక్ష్యం వైపు 36 బాణాలను వదిలి అరుదైన రికార్డును సాధించింది. పద్దెనిమిదేళ్లలోపు వారు పాల్గొనే ఆ పోటీలో 360 పాయింట్లకు 290 పాయింట్లు సాధించి ‘ఔరా’ అన్పించింది. జాతీయ ఆర్చరీ సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ సంఘం పరిశీలకుల సమక్షంలో బాణాలు సంధించి తాజాగా ఇండియా బుక్, ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం పొందింది. శివాని సాధించిన రికార్డులకు సంబంధించిన పతకాలను, ధ్రువీకరణ పత్రాలను ప్రపంచ ఆర్చరీ సమాఖ్య పరిశీలనకు పంపుతున్నట్లు ఎపి ఆర్చరీ సంఘం ప్రతినిధులు ప్రకటించారు.