యువ

ఆడదాం...పాడదాం ఆకట్టుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓపెన్ మైక్ ఈవెంట్...!
వినడానికి ఈ పేరు కొత్తగా ఉంది కదూ! వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లోనూ, ఉత్తర భారతంలోనూ ఇదేం కొత్త కాదు...హైదరాబాద్‌కు మాత్రం ఈ మధ్యే వచ్చింది. వచ్చీ రాగానే యువతలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలెంట్‌కు తెర తీస్తోంది. ఇంతకీ ఏమిటీ ఓపెన్ మైక్ ఈవెంట్?
ఓ విధంగా చెప్పాలంటే మనలోని ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఇదో వేదిక. స్టాండప్ కమేడియన్లు, సింగర్లు వంటి కళాకారులకు ఓపెన్ మైక్ ఓ వరం. క్లబ్బులు, కాఫీ షాప్‌లు వంటి చోట్ల ఇదివరకు అతి తక్కువ మంది కళాకారులకు వేదిక దొరికేది. ఓపెన్ మైక్ ఈవెంట్ ఏంటంటే- ఇందులో ఆడియనే్స ప్రదర్శన ఇవ్వొచ్చు. తమ కళను ప్రదర్శించుకోవచ్చు. ఎవరైనా వేదికనెక్కి అందర్నీ ఆకట్టుకోవచ్చు. ఇదే ఓపెన్ మైక్ సెషన్ అంటే. ఇప్పుడీ కల్చర్ హైదరాబాద్ అంతటా విస్తరిస్తోంది. క్లబ్బులు, కాఫీ షాప్‌లు వంటివి ఓపెన్ మైక్ ఈవెంట్లను స్వాగతిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ‘్ఫన్నీ సైడ్ అప్’ అనే కామెడీ గ్రూప్ సభ్యుడు రోహిత్ స్వెయిన్ ఈ మార్పును స్వాగతించారు. ‘గతంలో నేను ఏదైనా కాఫీ హౌస్‌కు వెళ్లి కామెడీ షో ఇస్తానంటే వద్దనేవారు. కరావోకే అయితే ఓకె అనేవారు. మాలాంటి వారికి ఓపెన్ మైక్ ఈవెంట్లు ఓ వరం’ అన్నారాయన. ఏఐబి, ది వైరల్ ఫీవర్ వంటి కామెడీ గ్రూప్స్ ఓపెన్ మైక్ ఈవెంట్లలో మరింత పేరు సంపాదిస్తున్నాయి. ‘గతంలో స్టాండప్ కామెడీ షోలంటే ఎరగని ఆడియెన్స్ కూడా ఇప్పుడు ఓపెన్ మైక్ ఈవెంట్లలో మా షోలను చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు’ అంటూ హుషారుగా చెప్పాడు ఫన్నీ సైడ్ అప్ గ్రూప్‌లో మెంబర్ సాయి కిరణ్. హైదరాబాద్ బదాస్ కామెడీ గ్రూప్‌కు చెందిన షాదాబ్ అజీజ్ అయితే ఓపెన్ మైక్ ఈవెంట్ ద్వారానే ఓ చక్కటి అవకాశాన్ని కొట్టేశాడు. ‘ఓ కామెడీ షోలో నా పెర్ఫార్మెన్స్ చూసిన కొందరు టాలీవుడ్ నిర్మాతలు మా గ్రూప్‌ను ఓ టీవీ షోకోసం బుక్ చేశార’ని షాదాబ్ చెప్పాడు.
ఈ సరికొత్త ట్రెండ్ సింగర్లకూ చక్కని అవకాశాలనిస్తోంది. ఓపెన్ మైక్ సెషన్లలో తరచూ పాటలు పాడే సందీప్ ప్రకాశ్ మాట్లాడుతూ ‘మామూలు షోలలో అయితే మేం బాలీవుడ్ పాటలే పాడేవాళ్లం. మాకు నచ్చిన పాటలు పాడే అవకాశం ఉండేది కాదు. ఓపెన్ మైక్ సెషన్లలో నాకు నచ్చిన పాటలు పాడి ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాను’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. సో, యువతలోని ప్రతిభను వెలికి తీసి, వారికి చక్కటి అవకాశాలను అందిస్తున్న ఓపెన్ మైక్ ఈవెంట్లను మనమూ స్వాగతిద్దాం! *