యువ

కుంగుబాటుతో కెరీర్‌కు చేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక ఆటుపోట్ల కారణంగా ఐటితో పాటు పలు రంగాల్లో ‘రెసిషన్’ (ఉద్యోగాలలో కోత) సమస్య కొన్నాళ్లుగా యువతను కలవరపెడుతోంది. ముఖ్యంగా భారతీయ యువత ఇటీవలి కాలంలో ఈ గండాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అమెరికాలోనే కాదు, మన దేశంలో కూడా ఇపుడు కొన్ని ఐటి కంపెనీల్లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ‘రెసిషన్’ సమస్య తాత్కాలికమే అని నిపుణులు భరోసా ఇస్తున్నప్పటికీ ఉపాధి అవకాశాలు తగ్గుతున్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కాగా, ‘రెసిషన్’ తీవ్రత పెరగడానికి ఆర్థిక ఆటుపోట్లే గాక యువతలో మానసిక ఒత్తిడులు కూడా ఒక కారణం అని ఇటీవల ఓ అధ్యయనంలో తేటతెల్లమైంది. ఈ పరిణామం భారత్‌తో పాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ‘్భవోద్వేగ సమస్యల’తో బాధపడే యువతీ యువకులు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని అధ్యయనంలో నిపుణులు తేల్చారు. మూడు పదులు నిండని వయసులో ఎంతో హుషారుగా, ఆనందంగా ఉండాల్సిన యువత తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతోంది. ఇందుకు వ్యక్తిగత, కుటుంబ పరమైన, కెరీర్ పరమైన అంశాలు కారణమవుతున్నాయి.
అనేకానేక వ్యక్తిగత సమస్యల ఫలితంగా కొందరు యువతీ యువకులు ఒత్తిడిని భరిస్తూ జీవితంలో ఏదో కోల్పోయినట్టు బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. దీంతో వీరు ఉపాధికి దూరమైపోతున్నారు. చలాకీగా ఉండాల్సిన వయసులో కుంగుబాటుకు లోనవుతున్న 16-20 ఏళ్ల వయసువారు 32 శాతం దాకా ఉద్యోగాలకు దూరం అవుతున్నారట! దీంతో మరో రకమైన ‘రెసిషన్’ సమస్య ఏర్పడుతోంది.
1980-84 మధ్య కాలంలో జన్మించిన ఏడువేల మందిని అమెరికాలో సర్వే చేసి, మొత్తం పనె్నండు సంవత్సరాల కాలవ్యవధిలో వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో అధ్యయనంలో లోతుగా విశే్లషించారు. మానసిక కుంగుబాటు, పలురకాల ఒత్తిళ్ల ప్రభావం యువత ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు. ఒత్తిళ్లు లేని వారు, కుంగుబాటుకు గురైన వారిని పోల్చిచూడగా స్పష్టమైన తేడా కనిపించింది. మానసిక భావోద్వేగాలను ఎదుర్కొంటున్న వారు నిరుద్యోగ సమస్యను భరించాల్సి వస్తోందని కనుగొన్నారు. వ్యక్తిగత సమస్యలను అధిగమించినపుడే యువత కెరీర్ పరంగా దూసుకుపోగలదని లేకుంటే వారు ఉపాధికి ఇబ్బందులు పడకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి ఆర్థిక ప్రయోజనాలు, ఉజ్వలమైన కెరీర్ పొందాలంటే కుంగుబాటు సమస్య బారిన పడకుండా యువత జాగ్రత్త పడాలని, ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా బాధ్యత వహించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఉద్యోగం ఇవ్వాలా? వద్దా?
ముఖ కవళికలు, బయోడేటాను చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు కావివి. అభ్యర్థి ముఖాన్ని, సర్ట్ఫికెట్లను చూసి నైపుణ్యాలను అంచనా వేయలేం. అందుకే ఇపుడు కొన్ని కంపెనీలు ఉద్యోగ నియామకాల సందర్భంగా ‘యాప్’లను వాడుతున్నాయట! ఫలానా ఉద్యోగానికి ఫలానా అభ్యర్థి సరిపోతాడో లేదా నిర్ధారించేందుకు ‘్దజూళేఖళ’ అనే యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థికి సంబంధించిన వీడియో ఇంటర్వ్యూను ఈ యాప్‌తో అనుసంధానం చేసి, అతని హావభావాలు, నైపుణ్యాలను అంచన వేస్తారు. అభ్యర్థుల బాడీ లాంగ్వేజి, అనుభవం, భాష, మాటతీరు వంటివి యాప్ ద్వారా విశే్లషిస్తారు. అభ్యర్థుల మనోభావాలను, శక్తిసామర్థ్యాలను తెలిపే ఇలాంటి యాప్‌లకు ఇపుడు గిరాకీ పెరిగింది. ఉద్యోగాలిచ్చే సంస్థలే కాదు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువత కూ వీటిని వినియోగించి తమ ప్రతిభాసామర్థ్యాలను తెలుసుకునే వీలుంది.