యువ

సమస్యలకు ‘సైక్లింగ్’తో చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, శబ్ద కాలుష్యం వంటి సమస్యలను అధిగమించాలంటే సైకిళ్ల వినియోగం పెరగాలని ‘హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్’కు చెందిన బానూరు సందీప్‌రెడ్డి అంటున్నాడు. పర్యావరణ కాలుష్యం వంటి విపరిణామాలపై ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు ఈ యువకుడు ఇప్పటికే దేశవ్యాప్తంగా 15,750 కిలోమీటర్ల మేరకు సైకిల్ యాత్ర చేసి చరిత్ర సృష్టించాడు. గతంలో పూణె (మహారాష్ట్ర)కు చెందిన సంతోష్ హోలి 111 రోజుల్లో 15,222 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేయగా, ఆ రికార్డును మన హైదరాబాద్‌కు చెందిన ఇరవై ఆరేళ్ల కుర్రాడు సందీప్ తిరగరాశాడు. మన దేశంలో ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజైనా కొన్ని గంటల సేపు సైక్లింగ్ చేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఈ యువకుడు చెబుతున్నాడు. సైకిల్ యాత్ర ప్రారంభించాలన్న ఆలోచన వచ్చినపుడు తనకు సొంత సైకిల్ కూడా లేదని తెలిపాడు. హైదరాబాద్ బైస్కిలింగ్ క్లబ్‌తో పాటు తన స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించడంతో తాను ఇంతటి రికార్డును సాధించానని తెలిపాడు. తన ఘనతను నమోదు చేయాలని ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు’ సంస్థకు దరఖాస్తు చేశానని వివరించాడు.
సైక్లింగ్ యాత్రను ప్రారంభించేముందు నిధుల కోసం పలు కార్పొరేట్ సంస్థలను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మిత్రుల సహకారంతో విరాశాలు సేకరించానని తెలిపాడు. పేదరికం, ఆకలి, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలపై సామాన్యులల్లో అవగాహన కలిగించేందుకు సైకిల్ యాత్ర తనకు ఎంతగానో ఉపకరించిందని ఆనందం వ్యక్తం చేశాడు. గంటకు ఏభై రూపాయల చొప్పున అద్దె చెల్లించి హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ నుంచి సైకిల్‌ను తీసుకుని తన మిత్రుడు కృష్ణతో కలిసి శిక్షణ కొనసాగించానని సందీప్ తెలిపాడు. దేశవ్యాప్తగా సైకిల్ యాత్ర చేయాలంటే స్పాన్సర్ల ప్రోత్సాహం, భారీగా విరాళాలు అవసరమని అంటున్నాడు. యాత్ర కోసం ఆధునిక సైకిళ్లను, జిపిఎస్ వాచ్‌లను కొనాలంటే నిధులు అవసరమని, ఇందుకోసం కనీసం లక్షన్నర రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు.
రాబోయే 165 రోజుల్లో 22 రాష్ట్రాలను, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను సైకిల్ యాత్ర సందర్భంగా చుట్టిముట్టిరావాలని సందీప్ సంకల్పించాడు. సైకిల్ యాత్ర చేస్తున్నపుడు ఒక్కోసారి తన జేబులో మూడు వందల రూపాయలు కూడా లేని సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సైకిల్ యాత్రను కొనసాగించాలన్నదే తన ధ్యేయం అంటున్నాడు. అనారోగ్యం కారణంగా కొల్హాపూర్ వద్ద తన మిత్రుడు కృష్ణ సైకిల్ యాత్ర నుంచి విరమించుకున్నా, తాను కాశ్మీర్ సహా వివిధ ప్రాంతాల్లో యాత్రను కొనసాగించానని తెలిపాడు. శారీరక దారుఢ్యంతో పాటు సామాజిక అంశాలపైనా ప్రజల్లో అవగాహన పెంచాలన్నదే తన జీవితాశయమని ఆయన చెబుతున్నాడు. సైక్లింగ్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న ఈ యువకుడు తగిన స్పాన్సర్ల కోసం ఎదురు చూస్తున్నాడు.