యువ

నచ్చిన కెరీర్ వైపే యువత మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంజనీరింగ్ చదివినా, ఎంబిఎ పూర్తి చేసినా తమకు నచ్చిన కెరీర్‌నే ఎంచుకునేందుకు నేటి యువత ఆసక్తి చూపుతున్నారు. అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్ రంగంలో భారీగా సంపాదిస్తున్నా అది కాస్త బోర్ కొట్టి స్వదేశానికి చేరుకుని స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్న యువకులూ ఉన్నారు.. కార్పొరేట్ కొలువుకు ‘గుడ్ బై’ కొట్టి సమాజ సేవలో పాల్గొనేందుకు మొగ్గు చూపుతున్న యువతులూ ఉన్నారు.. ఈ పరిణామాలు నేటి యువత కెరీర్‌లో తమ అభిరుచికి, ఆసక్తికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేటతెల్లం చేస్తున్నాయి. సంపాదన దండిగా ఉన్నా, అభద్రత పదే పదే వేధిస్తున్నా- మంచి ఉద్యోగాలను వదిలిపెట్టేందుకు నేటి యువత ఏ మాత్రం జంకడం లేదు. భవిష్యత్‌కు భరోసా ఇచ్చే స్థిరమైన పురోగతి వైపు యువత సుముఖత చూపుతోంది. ఒక్కోసారి మంచి అవకాశాలు కోల్పోయినా అధైర్య పడకుండా అనుభవం నేర్పిన పాఠాలతో ముందుకు దూసుకుపోతున్న యువత తమ కేరీర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇటీవల ‘జెడ్ జనరేషన్’ (21- 27 ఏళ్లు) యువత కెరీర్ ఆకాంక్షలపై ఇటీవల జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
దేశంలోని అయిదు ప్రముఖ నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్‌కత, చెన్నై, హైదరాబాద్‌లలో ‘జెడ్ జనరేషన్’ సర్వే నిర్వహించగా విభిన్న కెరీర్‌ల పట్ల యువత మొగ్గు చూపుతున్నట్లు తేలింది. డిజిటల్ మీడియా, వినోదం, ఈ-కామర్స్- సోషల్ మీడియా, రిటైల్ రంగాల్లో ఉపాధి కోసం యువత అనే్వషిస్తోంది. దిల్లీలో డిజిటల్ మీడియా, ఈ-కామర్స్, డిజిటల్ మీడియా, రిటైల్ రంగాల్లో యువత ఆసక్తి చూపుతోంది. హైదరాబాద్‌లో బిపివో, కాల్‌సెంటర్లు, సోషల్ మీడియా, ఈ-కామర్స్ పట్ల యువత సుముఖత చూపుతోంది. బెంగళూరులో బిపివో, కాల్‌సెంటర్లు, ఈ-కామర్స్, డిజిటల్ మీడియా పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. చెన్నై, ముంబయిల్లో కూడా ఇవే రంగాల పట్ల యువత అభిరుచి ఎక్కువగా ఉంటోందని అధ్యయనంలో తేలింది. రెండు, మూడేళ్ల క్రితం కెరీర్ పట్ల అవగాహన పెంచే సంస్థలు అంతగా లేవు. అధ్యాపకుల సలహాలపై యువత ఆధారపడాల్సి వచ్చేది. అయితే, ఇటీవల కెరీర్ పరంగా సలహాలిచ్చే సంస్థలు ఎక్కువ కావడంతో యువతకు గైడెన్స్ ఇచ్చే అధ్యాపకులు లేకున్నా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 21-27 ఏళ్ల యువకుల్లో దాదాపు 79 శాతం మంది ఎవరి గైడెన్స్ లేకుండానే తమకు నచ్చిన కెరీర్‌లో అడుగుపెట్టేందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, యువతులు మాత్రం ఇంకా కొంతవరకూ అధ్యాపకుల గైడెన్స్‌పై ఆధారపడుతున్నారని తేలింది. దేశంలో వివిధ ప్రాంతాలు, నగరాలలో యువత ప్రాధ్యానతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. నగరాల్లో డిజిటల్ మీడియా, ఈ-కామర్స్, సోషల్ మీడియా పట్ల మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సేవారంగంపై యువత ఆసక్తి చూపుతోంది. దేశవ్యాపంగా స్మార్ట్ఫోన్ల వినియోగం, అంతర్జాలం వాడకం అనూహ్యంగా పెరగడంతో ఈ-కామర్స్ పట్ల యువత అధికంగా ఆసక్తి చూపుతోంది. కెరీర్‌లో తొందరగా ఎదిగేందుకు అవకాశాలు ఉండడం, జాబ్ రిస్క్ తక్కువ కావడంతో ఈ-కామర్స్‌పై ఎక్కువమంది యువతీ యువకులు మొగ్గు చూపుతున్నారు. బిపివో, కాల్‌సెంటర్లు కూడా యువతకు లక్ష్యంగా మారుతున్నాయి. నేటి ఆధునిక యుగంలో ఉద్యోగం అంటేనే ఐటి, సాఫ్ట్‌వేర్ అన్న అపోహ చాలామందిలో ఉంది. ఈ రంగాల్లో స్థిరపడితేనే కెరీర్ ఉజ్వలంగా ఉంటుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే, ఇటీవలి కాలంలో యువత అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తోంది. ఐటి, సాఫ్ట్‌వేర్ కంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఈ-కామర్స్, వినోదం, రిటైల్ రంగాలపై యువత సుముఖత చూపుతున్నారు. ముఖ్యంగా ఐటి రంగంలో ఉద్యోగాలకు సంబంధించి దేశవిదేశాల్లో ‘కోత’ విధించడం, వీసా సమస్యలు, జాతి వివక్ష వంటి అంశాల కారణంగా యువత దృక్పథంలో మార్పు కనిపిస్తోందని తేలింది. దీంతో దేశీయంగా ఈ-కామర్స్, డిజిటల్, సోషల్ మీడియ, రిటైల్ రంగాల పట్ల యువతలో ఆసక్తి పెరిగింది.
ఒకప్పుడు నచ్చిన ఉద్యోగం రాకున్నా, ఇంటర్వ్యూలో విఫలమైనా యువత తీవ్ర నిరాశకు లోనయ్యేది. కానీ, ఇపుడు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ నచ్చిన కెరీర్‌లో స్థిరపడాలని యువత భావిస్తోంది. ఆశించిన ఉద్యోగం రానిపక్షంలో అందుకు తగిన ప్రత్యామ్నాయాలపైనా యువత ఇపుడు దృష్టి సారిస్తోంది. గిరి గీసుకుని కూర్చున్నట్లు గాక, తమకు అభిరుచి ఉన్న రంగాల్లో స్థిరపడాలని యువతీ యువకులు కోరుకుంటున్నారు. ఒకే రంగాన్ని నమ్ముకోకుండా తమ సామర్థ్యాలను పదునుపెట్టుకునే వారు కెరీర్‌లో రాణిస్తున్నారు. ఐటి, సాఫ్ట్‌వేర్ రంగాల్లో అనుకున్నది దక్కని పక్షంలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఈ-కామర్స్, రిటైల్ రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తమ లక్ష్యాలను సాధించేందుకు సరికొత్త రంగాల్లో నైపుణ్యాలను సాధించాలని యువత ఆరాటపడుతోంది. అదనపు నైపుణ్యాల కోసం శిక్షణ తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాము ఉద్యోగం చేస్తున్న రంగంలో ఎలాంటి విపరిమాణాలు సంభవించినా, వాటి నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి పెట్టేందుకు యువత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాన నగరాలలో జరిపిన అధ్యయనంలో తేలింది. అభద్రత ఉన్న ఉద్యోగాల్లో కాలం గడపడం కన్నా, తమకు నచ్చిన కెరీర్‌లో కృషి చేయాలన్న తపన యువతలో పెరగడం శుభ పరిణామమని నిపుణులు విశే్లషిస్తున్నారు.