యువ

ఇక ‘శోధన’ మరింత సులభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ అంశానికి సంబంధించైనా సమాచారం, ఫొటోలు కావాలన్నా ‘గూగుల్’లో ‘శోధించడం’ అందరికీ అలవాటుగా మారింది. అయితే, ఒకే అంశానికి సంబంధించి వందలాది పేజీల సమాచారం, లెక్కలేనన్ని వెబ్‌సైట్ల వివరాలు మనకు చిరాకు తెప్పించడం సహజం. మనకు కావాల్సిన సమాచారం కుప్పలు తెప్పలుగా రావడంతో ఈ ‘వెతుకులాట’ ఎవరికైనా విసుగు తెప్పించడం ఖాయం. మారుతున్న పరిస్థితులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ‘శోధన’ను సులభతరం చేయాలని ‘గూగుల్’ సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ‘గూగుల్ ఫీడ్’ రంగప్రవేశం చేస్తోంది. మనం అడిగిన అంశానికి సంబంధించి కొద్దిపాటి ‘కంటెంట్’ను దీని ద్వారా పొందవచ్చు. మన ‘శోధన’ (సెర్చింగ్)కు తగ్గట్టుగా ‘గూగుల్ ఫీడ్’ పరిమితమైన ‘కంటెంట్’ను మనకు అందిస్తుంది. ఈ సౌకర్యం మన దేశంలో కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తేవాలని ‘అంతర్జాల దిగ్గజం’ అయిన ‘గూగుల్’ నిర్ణయించింది. స్థానిక సమాచారాన్ని అందించడం ‘గూగుల్ ఫీడ్’లో అతి ముఖ్యమైన అంశం. ఇందుకోసం ‘న్యూ టు యూ’, ‘లోకల్ బేస్డ్ పర్సనలైజ్డ్ న్యూస్ ఫీడ్’ పేర్లతో ప్రత్యేక పోర్టళ్లు కూడా తేవాలని గూగుల్ భావించింది. తాజా సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ‘గూగుల్ ఫీడ్’ ‘శోధన’ చేసే వారికి దోహదపడుతుంది. ‘స్మార్ట్ స్పీకర్’, ‘అసిస్టెంట్’ అనే రెండు ఫీచర్లతో ‘గూగుల్ హోమ్’ను సరికొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొద్ది నెలల్లోనే కొలిక్కి వస్తాయని గూగుల్ చెబుతోంది. ఆంగ్లంతో పాటు భారత్‌లో ముఖ్యమైన ప్రాంతీయ భాషల్లోనూ ‘గూగుల్ ఫీడ్’ అందుబాటులోకి రాబోతోంది.