యువ

మెసేజ్‌లు ఇక పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ నేడు విరివిగా వినియోగిస్తున్నందున ‘వాట్సాప్’కు నానాటికీ క్రేజ్ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తున్న ఈ ‘మెసేజింగ్ యాప్’ మరో అడుగు ముందుకేసింది. వాట్సాప్‌లో మనం పంపించుకొనే సందేశాలను స్టోర్ చేసుకునే అవకాశం ఇంతవరకూ లేదు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు వంటివి మాత్రమే ఫోన్ మెమొరీలో ఉంటాయి. ఇకపై మెసేజీలను సైతం నిక్షిప్తం చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ తొలిసారిగా కల్పిస్తోంది. ఐఓఎస్ ఫోన్లలో మాత్రమే మనం మెసేజీలను భద్రపరచుకునే వీలుంది. ఈ సౌకర్యాన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందించేందుకు వాట్సాప్ రంగం సిద్ధం చేసింది. వాట్సాప్ వినియోగదారులు ఫోన్ సెట్టింగ్స్‌లోకి ‘డేటా అండ్ స్టోరేజి యూసేజ్’లోకి వెళ్లి అక్కడ ‘క్లిక్’ చేస్తే చాలు మెసేజీలన్నీ పదిలంగా ఉంటాయి. వాట్సాప్ వి2.17,340 బీటా వెర్షన్ వాడే వారు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. మెసేజీలే కాదు, ఫొటోలు, వీడియోలు, జిప్ ఫైళ్లు, డాక్యుమెంట్లను సైతం నిక్షిప్తం చేసుకోవచ్చు.