యువ

నైపుణ్యానికి ‘ఒత్తిడి’ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని వృత్తుల్లో ఉన్నవారిలో 30 శాతం మంది తీవ్ర ఒత్తిడి, కుంగుబాటు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు మానసిక వైద్యులు తేల్చిచెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి ఉండడంతో యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని తేలింది. ‘ఆన్‌లైన్ డాక్టర్స్ కన్సల్టేషన్ ప్లాట్‌ఫామ్’ నిర్వహించిన తాజా సర్వేలో పలు ఆందోళనకరమైన అంశాలు వెలుగు చూసాయి. ఒత్తిడి శరీరానికి కాదని, పని ప్రదేశంలో ప్రతికూల పరిస్థితులే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమని సర్వేలో బహిర్గతమైంది. ముంబయిలో అత్యధికంగా 31 శాతం ప్రొఫెషనల్స్ ఒత్తిడికి గురవుతున్నారు. ఢిల్లీలో 27 శాతం, బెంగళూరులో 14 శాతం, హైదరాబాద్‌లో 11 శాతం, చెన్నైలో 10 శాతం, కోల్‌కతాలో 7 శాతం మంది వృత్తి, ఉద్యోగ నిపుణులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఏడాదిపాటు జరిగిన అధ్యయనంలో ‘ఆన్‌లైన్ డాక్టర్స్ కన్సల్టేషన్ ప్లాట్‌ఫామ్’ సంస్థకు చెందిన మానసిక నిపుణులు వివిధ రకాలకు చెందిన సుమారు లక్షమంది ప్రొఫెషనల్స్‌ని పలు అంశాలపై ఆరా తీసారు. అందరిలో కంటే అత్యధికంగా 24 శాతం మంది మార్కెటింగ్ ఉద్యోగులు మానసిక సమస్యలను తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు. ఆ తరువాతి స్థానంలో మెడికల్, ప్రజా సంబంధాల విభాగాలకు చెందిన ఉద్యోగులు 22 శాతం మంది, బిపిఓల్లో 17 శాతం మంది, పర్యాటక రంగంలో 9 శాతం మంది, మేనేజ్‌మెంట్ విభాగాల్లో 8 శాతం మంది మానసిక ఒత్తిడిని భరిస్తూ నైపుణ్యాలను కోల్పోతున్నారని సర్వేలో వెల్లడైంది. ఎంత కష్టమైన పని అయినా ఇష్టపడి చేస్తే ఒత్తిడి ఉండదని మానసిక నిపుణులు చెబుతుంటారు. అయితే ఆధునిక జీవనంలో వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా నానాటికీ సమస్యలు చుట్టుముట్టడంతో మానసిక ఒత్తిడి అనివార్యమవుతోంది. ఇష్టపడి చేస్తున్న ఉద్యోగంలో కూడా అక్కడి పరిస్థితి కారణంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉద్యోగ భద్రత, అనారోగ్యకర పోటీ వాతావరణం, పనికి తగిన గుర్తింపు దక్కకపోవడం, బాసుల వేధింపులు వంటివి ఉద్యోగుల ఒత్తిడికి కారణమవుతున్నట్టు మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మనసులోని భావాలను చెప్పుకోలేక ఎంతోమంది వృత్తి, ఉద్యోగ నిపుణులు భావోద్వేగాలకు లోనవుతూ కుంగుబాటుతో బాధపడుతున్నారు.
కిందిస్థాయి ఉద్యోగులు మొదలు ఉన్నత అధికారుల వరకూ మానసిక సమస్యలు తప్పడం లేదు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ చాలామంది వాటిని ఎదుర్కొంటూ యాంత్రికంగా పనిచేస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో ఈ పరిస్థితి మానసికంగా, శారీరకంగా వారిని చిత్తు చేస్తూ తీవ్రమైన కుంగుబాటు సమస్యకు దారి తీస్తుందని ప్రముఖ సైకియాట్రిస్టులు చెబుతున్నారు. లక్ష్యాలను సాధించాలన్న తపనతో పనిచేసే ఐటి, కార్పొరేట్ సంస్థలు, పోలీసు శాఖ, వైద్య సంస్థల్లో పనిచేసేవారిలో ఎక్కువ వృత్తిపరమైన ఒత్తిడి కనిపిస్తోంది. శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా కుంగుబాటు సమస్యను వైద్యులు అంచనా వేస్తారు. అయితే వృత్తి, ఉద్యోగ నిపుణులు మాత్రం ఈ సమస్యను ముందుగా గుర్తించలేకపోతున్నారు. సరైన సమయంలో డిప్రెషన్‌ను గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ‘విపరీతమైన నిర్ణయాల దిశ’గా వెళ్లకుండా చాలామందిని కాపాడే అవకాశం ఉందని మానసిక వైద్యులు భరోసా ఇస్తున్నారు. బాధలో కూరుకుపోవడం, నిద్ర పట్టకపోవడం, ఎక్కువ సేపు నిద్రపోవడం, ఆకలి వేయకపోవడం, తమకు ఏమీ చేతకాదని బాధపడడం, ఏ పనిపైనా దృష్టి పెట్టకపోవడం, త్వరగా అలసిపోవడం, ఆత్మహత్యల గురించి ప్రస్తావించడం వంటివి కుంగుబాటుకు లక్షణాలుగా భావించాలి. కుంగుబాటు అనేది సాధారణమైన అనారోగ్య సమస్యే. చికత్స వల్ల దీనినుంచి బయటపడే అవకాశం ఉంది. ఒత్తిడికి లోనైన వారు ఫిజియోథెరపీ, ధ్యానం, యోగా వంటివి ఆచరించాలి. సాధ్యమైనంతవరకు వృత్తిపరమైన ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించాలి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు పుస్తక పఠనం, సంగీతం వినడం, పిల్లలతో గడపడం, వారాంతపు సెలవుల్లో కుటుంబ సభ్యులతో ఇతర ప్రాంతాలకు వెళ్లడం, మత్తుపదార్థాలకు దూరం కావడం వంటివి అలవాటు చేసుకోవాలి. కుంగుబాటు, ఒత్తిడి వంటి లక్షణాలు ఐదువారాల మించి కనిపిస్తే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మెదడులోని న్యూరో ట్రాన్స్‌మీటర్ల పనితీరులో చోటుచేసుకునే వ్యత్యాసాలే కుంగుబాటు లక్షణం. కౌనె్సలింగ్ థెరపీ, ఔషధ చికిత్స ద్వారా ఈ మానసిక ఉపద్రవాన్ని అధిగమించవచ్చు. కాగా, పురుషులతో సరిసమానంగా మహిళలు అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నప్పటికీ వారిని వృత్తిగత, వ్యక్తిగత ఒత్తిడి వేధిస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో పురుషుల కంటే మహిళలలోనే ఒత్తిడి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటి బాధ్యతలతోపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల మహిళలు ఎక్కువగా ఒత్తిడిని భరిస్తున్నారు. ఆహార నియమాలు, మంచి ఆరోగ్య పద్ధతులు పాటించినప్పుడు ఒత్తిడి సమస్యను అధిగమించే వీలుంది.