యువ

అప్‌డేట్’ అయితేనే అవకాశాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగుల్లో సరికొత్త నైపుణ్యాలను పెంపొందిస్తూ, వారిని సమర్ధులుగా తీర్చిదిద్దేందుకు నేడు కార్పొరేట్ సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐటి రంగంలో తాజా సాంకేతిక విషయాలపై అవగాహన ఉన్నవారికే ఉపాధి లభించే పరిస్థితి ఏర్పడింది. యాంత్రీకరణ, డిజిటలీకరణ వైపు దృష్టి సారిస్తున్న ఐటి రంగంలో ఉపాధి పొందాలనుకుంటున్న, ఇప్పటికే పొందుతున్న వారు సైతం తాజా నైపుణ్యాలను ఒడిసిపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ‘ఎక్స్‌పెరిస్ ఐటి-మాన్‌పవర్ గ్రూప్ ఇండియా’ సంస్థ ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటి రంగంలో కొత్తగా ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండడంతో, నిపుణులను తగిన విధంగా సర్దుబాటు చేసే పరిస్థితి ఏర్పడిందని ఆ సర్వేలో వెల్లడైంది. ఆధునిక సాంకేతిక అంశాలపై ఉన్న ఆసక్తికి, అభిరుచికి అనుగుణంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను వివిధ విభాగాల్లోకి మార్చడం, అవసరమైతే వారికే శిక్షణ ఇప్పించి కొత్త బాధ్యతలను అప్పగించడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే కాలంలో కింది, మధ్య స్థాయి వరకే నియామకాలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఉద్వాసన చెప్పే ప్రమాదం లేకపోలేదు. దేశవ్యాప్తంగా ఐదు వందల ప్రముఖ ఐటి సంస్థల నిర్వాహకుల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు సర్వే వివరాలను వెల్లడించారు. కొత్త నియామకాల పేరిట ఎక్కువ మందిని నియమించుకోవడం కన్నా- ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకే ఐటి సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో అనుభవం, నైపుణ్యం ఉన్నవారికి కొత్త ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కుతాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఐటి రంగంలో కొత్త నియామకాలు అంతగా పెరిగే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోకుండా వుండాలంటే కొత్త నైపుణ్యాలను అభ్యసించేందుకు ఐటి ఉద్యోగులు దృష్టి సారించాల్సి వుంటుంది.
అత్యధిక డిమాండ్ ఉన్న నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదు. క్లౌడ్ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఇఆర్‌పి) సాఫ్ట్‌వేర్ కృత్రిమ మేధ వంటి రంగాల్లో నైపుణ్యాలను అలవరుచుకోవాలని ‘మాన్ పవర్ గ్రూప్ ఇండియా’ సర్వే తేల్చి చెబుతోంది. యాంత్రీకరణ, డిజిటలీకరణ ప్రభావం వల్ల సంప్రదాయ ఐటి ఉద్యోగులపై అధిక ప్రభావం ప డుతోంది. దేశీయంగా ఐటినియామకాలపై కొంత సానుకూలత ఉన్నా, అనేక దేశాల్లో అనిశ్చితి ఉన్నందున అధిక నైపుణ్యం ఉన్నవారికే పట్టం కట్టాలని ఐటి సంస్థలు భావిస్తున్నాయి.
ప్రైవేట్ రంగం కీలకం
ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 20 కోట్లకు మించిపోయినట్టు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజా నివేదికలో వెల్లడించింది. ‘వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ అవుట్‌లుక్-2017’ నివేదికలో పలు ఆందోళనకరమైన అంశాలు వెలుగు చూసాయి. గత ఏడాది నాటి నిరుద్యోగ సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు ఉపాధి కోసం ఎదురుచూసే వారి సంఖ్య 34 లక్షలు పెరిగింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో వృద్ధి లేకపోవడం ఇందుకు కారణం అని నిపుణులు గుర్తించారు. ఉద్యోగాల కల్పనలో ప్రైవేటు రంగమే ఇప్పటికీ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది నాటికి ప్రైవేట్ రంగంలో280 కోట్లమంది ఉపాధి పొందుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్యలో ఇది 87 శాతం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం దాదాపు 78 కోట్లమంది కార్మికులు ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో సుమారు 140 కోట్లమంది కార్మికులు ఉద్యోగ భద్రత లేని దీనస్థితిలో ఉన్నారు. వీరి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. స్థిరమైన ఆదాయం, శాశ్వత ఉపాధి లేకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా మారాయని ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక స్పష్టం చేసింది.
మరోవైపు కొత్త ఉద్యోగాల కల్పనలో అంతర్జాతీయ వాణిజ్య ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాల నుంచి అందిపుచ్చుకునేందుకు చాలా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. పరిస్థితులు సానుకూలంగా ఉంటే అంతర్జాతీయ వాణిజ్యం పెరిగే అవకాశం ఉంది. అయితే 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యం మందగించిది. పరోక్షంగా ఇది ఉద్యోగాల కల్పనను దెబ్బ తీసింది. ఆర్థికవృద్ధి మందగించిన ఫలితంగా అనేక సంస్థలు కొత్తగా ఉద్యోగావకాశాలను కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. కార్మిక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేస్తే ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రత ఆశాజనకంగా ఉంటాయని ప్రపంచ కార్మిక సంస్థ చెబుతోంది. పరిశోధనల విస్తృతి, సరికొత్త సాంకేతిక నైపుణ్యాల ఆవిష్కరణ వల్ల ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని ఐఎల్‌ఓ నివేదిక తెలిపింది.
మహిళల భాగస్వామ్యం తక్కువే..
ఉపాధి రంగంలో మహిళలకు అవకాశాలను పెంచాలని ప్రభుత్వాలు నిర్ణయించినా ఆ దిశగా ఫలితాలు దక్కడం లేదు. ఉద్యోగాల్లో మహిళలకు ‘కోటా’ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో కొన్ని శాఖలకు సంబంధించి దరఖాస్తు చేసే మహిళల సంఖ్య తక్కువేనని తేలింది. కేంద్రం అధీనంలోని స్ట్ఫా సెలక్షన్ కమిషన్ కన్నా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలపైనే మగువలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. స్టాప్ సెలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసే మహిళల సంఖ్య 35 శాతానికి మించక పోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి భాగస్వామ్యం తక్కువగానే ఉంటోంది. దరఖాస్తు చేసే మహిళల్లో 11 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. తగిన అవగాహన, సరైన శిక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేంద్రం భావిస్తోంది.
కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలకు పోటీ పడుతున్న వారిలో పురుషుల సంఖ్య అధికంగా ఉంటోంది. స్ట్ఫా సెలక్షన్ కమిషన్ తాజా నివేదికలో ఈ వివరాలు వెలుగు చూశాయి. ఉద్యోగం నిమిత్తం కుటుంబ సభ్యులను వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుందన్న భావన ఇప్పటికీ మహిళల్లో నెలకొంది. ఈ కారణంగానే ఆర్మీ, సిబిఐ, సిఆర్‌పిఎఫ్ వంటి విభాగాల్లో ఎఎస్‌ఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు మహిళలు అంతగా దరఖాస్తు చేయడం లేదు. త్రివిధ దళాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని కేంద్రం భావిస్తున్నా సరైన ఫలితాలు రావడం లేదు. ఉద్యోగ నియమకాల సందర్భంగా మహిళలకు దరఖాస్తు రుసుమును రద్దు చేసినప్పటికీ మార్పు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఐఐటిలు, ఐఐఎంల వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో మహిళలకు సీట్లు పెంచడం, ప్రవేశపరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం వంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ చర్యల వల్ల రాబోయే కాలంలో విద్య, ఉద్యోగ రంగాల్లో మగువల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.