యువ

ఇక హైస్పీడ్ ఛార్జింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్ ఎంత ఖరీదైనప్పటికీ ఛార్జింగ్ సమస్య తలెత్తితే అది ఎందుకూ కొరగానిదవుతుంది. అత్యవసరం అనుకున్న సమయంలో ఫోన్‌కు ఛార్జింగ్ లేకుంటే మనం పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఛార్జింగ్ కూడా క్షణాల్లో అయిపోవాలని కాసేపు ఓపిక పట్టేందుకు కూడా చాలామంది అసహనం ప్రదర్శిస్తుంటారు. అందుకే- కేవలం సెకన్ల వ్యవధిలోనే స్మార్ట్ఫోన్ పూర్తి స్థాయిలో ఛార్జ్ అయ్యే కాలం తొందరలోనే వస్తోందట! ఈ విషయమై వాటర్‌లూ విశ్వవిద్యాలయం (కెనడా) పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. మామూలు బ్యాటరీల కంటే సూపర్ కెపాసిటర్లు అత్యంత తొందరగా ఛార్జ్ అవుతాయి. వీటిలో విద్యుత్‌ను నిల్వ చేసే సామర్థ్యం తక్కువగా ఉంటున్నందున, ఈ లక్షణాన్ని మెరుగుపరచేందుకు నిపుణులు కొత్తమార్గాలను అనే్వషించారు. ఆ ప్రయత్నంలో భాగంగా సూపర్ కెపాసిటర్ల ఎలక్ట్రోడ్‌లలోని గ్రాఫీన్ పొరల మధ్య ద్రవరూప లవణాలను పూశారు. ఇవి ఎలక్ట్రోలైట్ ద్రావణంలా పనిచేస్తూ విద్యుత్ నిల్వ సామర్థ్యం పెరగడాన్ని పరిశోధకులు గుర్తించారు. చిన్న సైజు సూపర్ కెపాసిటర్లను స్మార్ట్ఫోన్లలో వాడితే వేగవంతంగా ఛార్జింగ్ అవుతుందని, విద్యుత్ నిల్వ సామర్థ్యం సైతం మెరుగుపడుతుందని వారు తేల్చి చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఇందుకు అనుగుణంగా మార్పులు చేస్తే ఛార్జింగ్ సమస్య వేధించదని వారు స్పష్టం చేస్తున్నారు.