యువ

మేలు చేసే ‘సహాయకుడు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం అత్యవసర పనిలో నిమగ్నమైనా, డ్రైవింగ్‌లో ఉన్నా- ఏ మాత్రం ఇబ్బంది పడకున్నా కోరుకున్న వ్యక్తికి క్షణాల్లో స్మార్ట్ఫోన్‌లో వెంటనే కాల్ చేయవచ్చు. ‘డాడ్’ అని చెబితే నాన్నకు, ‘మామ్’ అని చెబితే అమ్మకు వెంటనే ఫోన్‌కాల్ వెళ్తుంది. ఇలాంటి సేవలెన్నింటినో మనకు అందుబాటులో ఉంచేలా గూగుల్ సంస్థ ‘గూగుల్ అసిస్టెంట్’ పేరుతో వినూత్న యాప్‌ను తీర్చిదిద్దింది. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది వివిధ రకాల స్మార్ట్ఫోన్లలో డిఫాల్ట్‌గా కూడా ఉండొచ్చు. ఫోన్‌లోని హోమ్ బటన్‌ను నొక్కిపెడితే ఇది అందుబాటులోకి వస్తుంది. మన ‘వాయిస్’ ఆధారంగా కాల్స్, మెసేజ్‌లను ‘గూగుల్ అసిస్టెంట్’ పంపుతూ మనకు నిజమైన సహాయకుడిలా పనిచేస్తుంది. బంధుమిత్రుల జన్మదిన తేదీలను సెట్ చేసుకుంటే ఆ సమయానికి బహుమతులు కొనాలని, శుభాకాంక్షలు చెప్పాలని గుర్తు చేస్తుంది. మన ఆజ్ఞానుసారం ‘సెల్ఫీ’లను కూడా తీస్తుంది. నెలలో ముఖ్యమైన సందర్భాలను ముందుగానే గుర్తు చేస్తుంది. వాతావరణం, రూట్‌మ్యాప్‌లకు సంబంధించిన సమాచారం ఇస్తుంది. యూ ట్యూబ్‌లోకి వెళ్లి వీడియోలను మనం చెప్పినట్లు ప్లే చేస్తుంది. తాజావార్తల గురించి అడిగితే వాటిని క్షణాల్లో అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ (6.0) వెర్షన్ కలిగిన ఫోన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.