యువ

‘మాయాజాలం’తో మమేకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నాగరిక జీవన విధానంలో ‘అంతర్జాలం’ ఓ అంతర్భాగమైంది.. 1969 అక్టోబర్ 29న ఓ కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు ‘ఆన్‌లైన్’లో తొలిసారి ఒక మెసేజ్‌ను పంపించడంతో ‘ఇంటర్నెట్ శకం’ ఆరంభమైంది.. కాలగతిలో ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్టు ‘అంతర్జాలం’ ఓ ‘మాయాజాలం’లా విస్తరించింది.. ఆధునిక సాంకేతిక సౌకర్యాలు విశ్వానే్న శాసిస్తుండగా, వీటినే జనం శ్వాసిస్తుండగా- ఇందులో ‘అంతర్జాలం’ అత్యంత కీలకమైనదిగా ప్రఖ్యాతి పొందింది. క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టి రావడానికి, సమస్త సమాచారాన్ని తెలుసుకోడానికి దోహదం చేస్తోంది ‘ఇంటర్నెట్’. అందుకే అన్ని దేశాల్లో నెటిజన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మన దేశంలో ప్రస్తుతం 45 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారన్నది తాజా అంచనా. వీరిలో నగర, పట్టణవాసులు అరవై శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల వారు 40 శాతం. 1995లో విఎస్‌ఎన్‌ఎల్ (విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్) ద్వారా మన దేశంలో ‘అంతర్జాలం’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశ్వవ్యాప్తంగా 51 శాతం మంది ‘నెట్’లో విహరిస్తుండగా, ఇందులో 13.5 శాతం మంది భారతీయులు కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వందల కోట్ల మంది ‘నెట్’ సేవలను వినియోగించుకుంటున్నారు,
మనిషికి గాలి, నీరు, తిండి ఎంతగా అవసరమో నేడు ‘అంతర్జాలం’ కూడా జీవితావసరంగా మారింది. ఆర్థిక లావాదేవీలు, విద్య, ఉద్యోగం, వైద్యం.. ఇలా అన్నింటికీ ‘అంతర్జాలం’ అనుసంధానంగా మారింది. వినోదం, విజ్ఞాన రంగాలకు ఇది వేదికగా మారింది. సమాచార వ్యవస్థకు ఇది కీలక అవసరమైంది. ఉత్తరాలు, టెలిగ్రామ్‌ల వంటివి అవసరం లేకుండా ఇపుడు ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు రంగప్రవేశం చేశాయి. శుభాకాంక్షలు చెప్పుకోడానికి, సమాచారాన్ని అందిపుచ్చుకోడానికి అంతర్జాలం వీలు కల్పిస్తోంది. ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండానే మనకు కావాల్సిన సరకులను, వస్తువులను ఒక్క ‘క్లిక్’తో రప్పించుకునేలా నేడు ‘ఈ-కామర్స్’ విస్తరించింది. ఆన్‌లైన్ షాపింగ్ చేయడం నేడు జన జీవనంలో అంతర్భాగమైంది. చేతిలో స్మార్ట్ఫోన్.. దానికి ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.. బ్యాంకుల చుట్టూ తిరగకుండా నగదును ఎక్కడికైనా పంపడం.. మన ఇంటి ముంగిటకు ‘క్యాబ్’లను తెప్పించుకోవడం.. ఉన్నత చదువులకు, మంచి కెరీర్‌కు ఇది దారి చూపుతోంది.. ఇలా ఒకటేమిటి..? సకల అవసరాలకూ నేడు ‘అంతర్జాలం’ అనివార్యమైంది.
‘నాణానికి రెండో వైపు’ ఉన్నట్లే- ఇంటర్నెట్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. సమస్యలు కూడా అదే తీరులో ఉన్నాయి. ఇంటర్నెట్ పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు, అశ్లీల సంస్కృతి విస్తరిస్తోంది. సైబర్ నేరాల వల్ల ఎంతోమంది ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనికి దాసోహం అవుతున్న యువతలో చాలామంది తమ కెరీర్‌ను నిర్లక్ష్యం చేస్తూ తప్పుదోవ పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెడ ధోరణలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. సామాజిక వెబ్‌సైట్లలో మహిళల పట్ల అసభ్యత, ఇతరులను కించపరచడం, వంచించడం వంటివి పెను సవాళ్లుగా మారాయి. ఈ పోకడలను నివారించినపుడే అంతర్జాలం వల్ల అందరికీ మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.