యువ

సరైనోడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నటి వరకూ ఈ పేరు ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు గ్రేటర్‌లో ఈ పేరు మార్మోగుతోంది. మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన వారిలో అతి పిన్న వయస్కుడు ఫహదే కావడం దీనికి కారణం. ఉప్పుగూడనుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఫహద్ వయసు 21 సంవత్సరాలే. మజ్లిస్ టికెట్‌పై పోటీ చేసిన ఫహద్ ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ పైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈలోగానే ఎన్నికలు రావడం, స్వయంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడం, ఫహద్ పోటీ చేసి గెలవడం వెంటవెంటనే జరిగిపోయాయి. పోటీ చేయడం కొత్తే అయినా, రాజకీయాలు మాత్రం తనకు కొత్త కాదంటారు ఫహద్. ఎందుకంటే ఆయన తండ్రి అబ్దుల్ సమద్ బిన్ అబ్దత్ గతంలో రాజకీయాల్లో ఉన్నారు.
ఫహద్‌తో ముచ్చటించినప్పు డు... రాజకీయాల్లోకి వస్తానని ఎన్నడూ అనుకోలేదన్నారు. ‘యువత రాజకీయాల్లోకి రావాలని అసదుద్దీన్ ఎప్పుడూ అం టూ ఉంటారు. ఆయన మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి’ అని చెప్పారు. విద్య, ఆరోగ్యం, ఆహా రం- ఈ మూడింటినీ పేద ప్రజలందరికీ అందుబాట్లోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ‘1999 లో అక్బరుద్దీన్ ఎన్నికైనప్పుడు పేదలకు ఉచిత విద్యనందిస్తానని హామీ ఇచ్చి, ఆ దిశగా ఎం తో కృషి చేశారు. నా లక్ష్యమూ అదే. తాను ఇచ్చిన హామీని ఉప్పుగూడలో అక్బర్ 70శాతం వరకూ నెరవేర్చారు. మిగతా 30 శాతం నేను అమలు చేస్తాన’ని ఫహద్ చెప్పారు. ఉప్పుగూడలోని పేదలందరికీ ఐదు రూపాయలకు భోజన పథకాన్ని అందుబాట్లోకి తీసుకురావడం తన మరో లక్ష్యమన్నారు. గతంలో తన తండ్రి చేసిన ప్రజా సేవను చూసే ప్రజలు తనకు ఓట్లు వేశారని ఫహద్ వినయంగా చెప్పారు. తన తండ్రి పేరు నిలబెట్టేందుకు శాయశక్తులా కష్టపడతానన్నారు. సామాజిక మాధ్యమాల్లో తాను యాక్టివ్‌గా ఉంటానని, ఎవరైనా ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్‌లోనూ తనతో టచ్‌లో ఉండొచ్చన్నారు. సో, ‘యువ’ పాఠకుల తరపున ఈ యంగ్ పొలిటీషియన్‌కి బెస్ట్ఫా లక్ చెబుదాం!