యువ

మరింత అందంగా సెల్ఫీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టోరేజ్ మొమరీ, ర్యామ్, ప్రాసెసర్ వంటివే కాదు.. స్మార్ట్ఫోన్ అంటే- ఓ మినీ థియేటర్‌లా, జ్ఞాపకాల వేదికలా ఉండాలని నేటి యువత ఉవ్విళ్లూరుతోంది. అందుకే మార్కెట్‌లో సరికొత్త ఫీచర్లతో ఏదైనా మొబైల్ అడుగిడితే చాలు.. దాన్ని సొంతం చేసుకోవాలని కుర్రకారుకు ఒకటే ఆరాటం. కృత్రిమమేధతో మరింత అందంగా సెల్ఫీలు తీసుకునేందుకు ‘ఓపో’ సంస్థ వినూత్న మొబైల్‌ను పరిచయం చేస్తోంది. నాణ్యమైన కెమెరాలతో స్మార్ట్ఫోన్లు రూపొందించే ‘ఓపో’ విడుదల చేసిన ‘ఎఫ్-5’ మొబైల్‌ను చూస్తే యువత మనసు పారేసుకోవడం ఖాయం. ఇది సెల్ఫీ ప్రియులకు ప్రత్యేకం. 20 మెగా పిక్సెల్స్ కృత్రిమ మేధస్సు (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో మన ముఖాలను అత్యంత స్పష్టంగా చిత్రీకరించి అద్భుతమైన సెల్ఫీలను ‘ఎఫ్-5’ అందిస్తుంది. దేశీయ విపణిలో విడుదలైన ఈ మొబైల్‌లో ‘బటన్స్’ ఏమీ లేకుండా పూర్తి తెరతో ఇది అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్ పోర్టళ్లతో పాటు సెల్‌ఫోన్ దుకాణాల్లోనూ ఇది అమ్మకాలకు సిద్ధంగా ఉంది. 19,990- 24,990 రూపాయల ధరల శ్రేణిలో ఇది లభిస్తుంది. ఫేషియల్ ఆప్టిమజేషన్ టెక్నాలజీ కారణంగా ఫొటోలు తీసుకునేటపుడు బ్యాక్‌గ్రౌండ్‌ను మనకు కావాల్సినట్లు మార్చుకునే వీలుంది.