యువ

వైఫై హాట్‌స్పాట్‌గా ల్యాప్‌టాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది ఓ నిత్యావసర వస్తువులా మారిపోయింది. స్మార్ట్ఫోన్ దగ్గర నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు అన్నీ వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆధారంగానే పనిచేస్తున్నాయి. వైఫై ఇంటర్నెట్ కనెక్షన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో చాలా సందర్భాల్లో అంతరాయాలను మనం ఎదుర్కొనక తప్పదు. రౌటర్ వర్క్ కానప్పుడు, మొబైల్ కనెక్టివిటీ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినపుడు ఇంటర్నెట్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు తరచూ మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే మీ ల్యాప్‌టాప్‌నే వైఫై హాట్‌స్పాట్‌లా మలిచి ఇంటిల్లిపాదికీ ఇంటర్నెట్‌ను షేర్ చేయండి.ల్యాప్‌టాప్‌లతో ఇన్‌బిల్డ్‌గా పొందుపరచబడే వైఫై చిప్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇతర డివైస్‌లకు బ్రాడ్‌కాస్ట్ చేసుకునే వీలుంటుంది. మీ ల్యాపీ విండోస్ 10 యానివర్సరీ అప్‌డేట్‌పై రన్ అవుతున్నట్లయితే ఈ హాట్‌స్పాట్ షేరింగ్ ప్రొసీజర్ మరింత సులువుగా ఉంటుంది.
స్టెప్ 1
ముందుగా ల్యాపీలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్‌లను సెలక్టు చేసుకోండి.
స్టెప్ 2
నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్ విభాగంలోకి వెళ్లిన తరువాత మెయిన్ స్క్రీన్‌పై లెఫ్ట్ నేవిగేషన్ మెనూలో కనిపించే మొబైల్ హాట్‌స్పాట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 3
మూడవ స్టెప్‌లో భాగంగా మీ కనెక్షన్‌ను ఇతర డివైస్‌లకు షేర్ చేసేందుకు హాట్‌స్పాట్ సెట్టింగ్‌ను టోగుల్ చేయవల్సి వుంటుంది. ఇప్పుడు మీ ల్యాప్‌టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ కొద్ది సెకన్లలోని వైఫై హాట్‌స్పాట్ రూపంలో షేర్ అవటం ప్రారంభిస్తుంది.
స్టెప్ 4
మీ ల్యాప్‌టాప్ నుంచి హాట్‌స్పాట్ ద్వారా షేర్ అయ్యే ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇతర డివైస్‌లో పొందాలంటే మీ హాట్‌స్పాట్ కనెక్షన్‌కు సంబంధించి పాస్‌వర్డ్‌ను అక్కడ ఎంటర్ చేయవల్సి వుంటుంది. సిస్టం జనరేట్ చేసే పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకునేందుకు వీలుగా ఉండదు కాబట్టి ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి సులువైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి.
స్టెప్ 5
మరొక ప్రొసీజర్‌లో భాగంగా కనెక్టివిటీ అనే యాప్‌ను ఉపయోగించుకుని మీ లాప్‌టాప్‌కు సంబంధిచిన ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇతర డివైస్‌లతో షేర్ చేసుకునే వీలుంది.

-మాతుకుమల్లి వెంకట సాయి కిరణ్