యువ

‘షేరింగ్’కు ఇక దిగులెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు... సినిమాలు, వీడియోలు, ఫొటోలు, ఇతర ఫైల్స్‌ను మరొకరితో ‘షేర్’ చేసుకోవడం నేడు చాలామందికి ఓ అలవాటుగా మారింది. ఇందుకోసం ఇపుడు ఎక్కువగా ‘షేర్‌ఇట్’ యాప్‌నే ఆశ్రయిస్తున్నారు. ‘షేర్‌ఇట్’ ఆధిపత్యానికి ‘చెక్’ పెట్టేందుకు భిన్నమైన ఫీచర్లతో గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు సరికొత్త యాప్‌లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. ‘వైఫై’ సౌకర్యం ఉన్న స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఇప్పటికే ఫైల్స్‌ను ‘షేర్’ చేసుకునే సౌకర్యం ‘యాపిల్ ఎయిర్ డ్రాప్’లో మనకు అందుబాటులో ఉంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లకు పనికొచ్చేలా ‘నియర్ షేర్’ అనే వినూత్న యాప్‌ను రూపొందించింది. బ్లూటూత్ ద్వారా ఫొటోలు,వీడియోలు, ఇతర ఫైల్స్‌ను షేర్ చేసుకునేందుకు ‘నియర్ షేర్’లో వీలుంటుంది. విండోస్ ల్యాప్‌టాప్ ఉన్నవారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. డెస్క్‌టాప్‌లో అయితే బ్లూటూత్, యూఎస్‌బీ బ్లూటూత్ అడాప్టర్‌తో ‘షేర్’ చేసుకోవడం సులువే. ఇక, ‘ఫైల్స్ గో’ పేరిట గూగుల్ షేర్ యాప్‌ను ప్రవేశపెడుతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో బీటా వెర్షన్‌లో ఇది లభిస్తుంది. నకిలీ ఫొటోలను ఇది గుర్తిస్తుంది. ఫైల్స్‌ను సులుభంగా ‘షేర్’ చేస్తుంది.