యువ

అంధత్వాన్ని జయించి.. అరుదైన విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోనల్ స్థాయి క్రికెట్ పోటీ.. దేశంలోనే సుదీర్ఘ సైకిల్ యాత్ర.. లడఖ్ మారథాన్.. బెంగళూరు అల్ట్రా రన్.. కూర్గ్ నడక పోటీ.. తాజాగా ‘బోస్టన్ మారథన్’.. ఇలా విభిన్నమైన క్రీడల్లో ఒకే వ్యక్తి రికార్డులు సృష్టించడం చాలా అరుదు.. పాక్షిక అంధత్వంతో బాధపడుతున్న ఆ యువకుడు ఇంతటి ఘనతను సాధించాడంటే అద్భుతమే అని చెప్పాలి. క్రీడారంగంలో సత్తాచాటుకుంటున్న ఆ యువకుడికి అనుకోని శాపం ఎదురైంది. క్రమంగా తనకు చూపు తగ్గుతోందని తెలిసినా అతను ఏ మాత్రం నీరసించలేదు. క్రీడాకారుడిగా తన కలలను సాకారం చేసుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తునే ఉన్నాడు.
బెంగళూరుకు చెందిన సాగర్ బహేతి (32) నేత్రాలకు సంబంధించి ‘స్టార్‌గార్డ్’ అనే వ్యాధిని ఎదుర్కొంటున్నాడు. కంటిలోని ‘రెటీనా’పై చుక్కలు వ్యాపిస్తూ క్రమంగా దృష్టి తగ్గడం ఈ వ్యాధి లక్షణం. జన్యుపరంగా ఇతనికి ‘స్టార్‌గార్డ్’ వ్యాధి వచ్చిందని 2012లో వైద్యులు నిర్థారించారు. తనకు పాక్షికంగా అంధత్వం వచ్చిందని తెలిసినప్పటికీ సాగర్ ఏ మాత్రం అధైర్యపడలేదు. నడక పోటీలపై దృష్టి సారించి ఆ దిశగా కృషిచేసిన ఇతను గత ఏప్రిల్‌లో జరిగిన ‘బోస్టన్ మారథాన్’ పోటీలో భారత్ నుంచి పాల్గొన్న తొలి అంధుడిగా రికార్డు సృష్టించాడు. ఈ నెల 19న అంధుల కోసం నిర్వహించే ‘్ఢల్లీ హాఫ్ మారథాన్’ పోటీలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో పట్ట్భద్రుడైన సాగర్ పాక్షిక అంధత్వం శాపం కాలేదు. ఒక మీటరు దూరం వరకే ఇతనికి ఏదైనా కనిపిస్తుంది. కంటిచూపు క్రమంగా క్షీణిస్తుందని వైద్యుడు చెప్పిన మాటలు ఇతని ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం తగ్గించలేదు. చదవడం, వాహనాలను నడపడం వంటి పనులు చేయలేకపోతున్నా, తన జీవన విధానం మారిందని తనను తాను సముదాయించుకున్నాడు. దృష్టి తగ్గడం వల్ల 2012 నుంచి తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు. సన్నిహితులు ఒత్తిడి చేసినా క్రీడారంగంపై ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. అనుకోని రీతిలో సమస్యలు ఎదురైనా ఏ మాత్రం అధైర్య పడకుండా జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదల తనలో పెరిగిందని సాగర్ చెబుతుంటాడు. జీవితంలో అనుకున్నవన్నీ వాటంతట అవే సమకూరవని, ప్రతికూల పరిస్థితుల్లోనైనా సాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోగలమని ఇతను అంటున్నాడు. లడఖ్ మారథాన్, కూర్గ్ నడక పోటీ, బెంగళూరు అల్ట్రా మారథాన్ వంటి పోటీల్లో ప్రతిభ చూపి అందరినీ ఆకట్టుకున్నాడు. సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమాని అయిన ఇతను బెంగళూరులోని ఓ క్రికెట్ క్లబ్ తరఫున ఆడేవాడు. 2012లో క్రికెట్ పోటీలకు సాధన చేస్తుండగా బంతిని పట్టుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఇందుకు దృష్టి తగ్గడం కారణమని వైద్యులు తేల్చారు. 2012 నుంచి 2014 వరకూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇపుడు తనకు దృష్టి దోషం ఎంతమాత్రం శాపం కాదంటున్నాడు. బోస్టన్ మారథాన్ పోటీలో 42.195 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల 14 నిమిషాల 7 సెకండ్ల వ్యవధిలో నడిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మసాచుసెట్స్ (అమెరికా)లో అంధుల సంక్షేమ కార్యక్రమాలకు విరాళాల కోసం జరిగిన మారథాన్‌లో పాల్గొన్నాడు. ఈ మారథాన్ ద్వారా ‘మసాచుసెట్స్ అసోసియేషన్’ పదివేల అమెరికన్ డాలర్ల విరాళాలను సేకరించింది. ఇతను స్పెయిన్‌లో జరిగిన ‘స్కై డైవింగ్’లో పాల్గొని ప్రమాదానికి లోనయ్యాడు. దీంతో అతనికి అత్యవసరంగా శస్తచ్రికిత్స చేశారు. స్పెయిన్‌లో ప్రమాదానికి గురైనపుడు తనను ఎయిర్ అంబులెన్స్‌లో జరిపి వెంటనే శస్తచ్రికిత్స చేయడంతో పూర్తి ఆరోగ్యంతో బయటపడ్డానని సాగర్ గుర్తు చేస్తున్నాడు. ఆ తర్వాత బెంగళూరులో ఇతనికి మరోసారి శస్తచ్రికిత్స జరిగింది. రెండు సార్లు శస్తచ్రికిత్సలు జరిగినా, పాక్షిక అంధత్వం వేధిస్తున్నా తాను నడక పోటీలకు దూరం కానని చెబుతున్నాడు. వచ్చే నెలలో కాలిఫోర్నియాలో జరిగే ఫుల్ మారథాన్ పోటీల్లో పాల్గొంటానని తెలిపాడు. జీవనోపాధికి వ్యాపార రంగంలో స్థిరపడ్డానని అయినా క్రీడలకు దూరం కానని అంటున్నాడు. రెండింటినీ సమన్వయం చేసుకుంటున్న ఇతను క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు తరచూ వివిధ నగరాలకు వెళుతుంటాడు. సచిన్ టెండూల్కర్ ఆరాధిస్తూ క్రికెట్‌లో ఎదిగానని, ద్రావిడ్, కుంబ్లే, శ్రీనాథ్, విరాట్, ధోనీ అన్నా తనకు ఇష్టమని చెబుతున్నాడు. 2015లో క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు లార్డ్స్, ఈడెన్ గార్డెన్ స్టేడియంలకు వెళ్లడం మరచిపోని అనుభూతి అని అంటున్నాడు. ప్రస్తుతం అంధుల క్రికెట్‌లో మెళకువలను తాను తెలుసుకుంటున్నానని సాగర్ చెబుతున్నాడు.