యువ

సెల్ఫీ షూటర్ వచ్చేస్తోంది.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత మొబైల్ కంపెనీ ‘వివో’ సెల్ఫీ ప్రియుల కోసం సరికొత్త సెల్ఫీ షూటర్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. 18:9 యాస్పెక్ట్ రేడియోతో కూడిన బెజెల్ లెస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.18,990గా నిర్ణయించింది. 24 మెగా పిక్సెల్ సెల్ఫీ సామర్థ్యంతో వచ్చిన ఈ మొబైల్‌కి ఫ్లాష్ లైట్ కూడా అమర్చారు. వివో వీ7లో ఫీచర్లు.. 5.7 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే 1440న720 పిక్చెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జిబి రామ్, 32 జిబి స్టోరేజి, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, డ్యూయల్ సిమ్, 16 మెకా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 24 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4 జి వివొ ఎల్‌టిఈ డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, 4.2, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ.
కెమెరా సాయంతో
ఈ ఫోన్‌లోని కెమెరా సాయంతో యూజర్లు తమ ఫేస్‌ను పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుంటే ఫోన్ అన్‌లాక్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా పోర్ట్రెయిట్ మోడ్ అనే ఫీచర్‌ను కెమెరా యాప్‌లో అందిస్తున్నారు.
రెండు సిమ్‌లతోపాటు
ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్రత్యేక స్లాట్ ఇచ్చారు. దీంతో రెండు సిమ్‌లతోపాటు, మెమెరీ కార్డును కూడా ఈ ఫోన్‌లో వేసుకోవచ్చు. నవంబర్ 24వ తేదీనుంచి ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. వివో వీ7 స్మార్ట్ఫోన్ మ్యాట్ బ్లాక్, షాంపేన్ గోల్డ్ రంగుల్లో ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తోంది.